EPAPER

Thalapathy 69: ఘనంగా పూజా కార్యక్రమాలు.. విడుదల ఎప్పుడంటే..?

Thalapathy 69: ఘనంగా పూజా కార్యక్రమాలు.. విడుదల ఎప్పుడంటే..?

Thalapathy 69..కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) చివరి సినిమాగా తెరకెక్కుతున్న దళపతి 69 సినిమాని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీఎన్ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో ఈ భారీ బడ్జెట్ మూవీకి కొబ్బరికాయ కొట్టేశారు. నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో నటించే నటీనటులు , సాంకేతిక నిపుణుల సమక్షంలో విజయ దళపతి 69 మూవీ పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా సందడి వాతావరణంలో పూర్తయ్యాయి.


పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన దళపతి69..

శనివారం అనగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. విజయ్ కెరియర్ లోనే హిస్టారికల్ ప్రాజెక్టుగా ఈ సినిమా నిలిచిపోతుందని, సిల్వర్ స్క్రీన్ మీద ఆయన చివరి సినిమాగా కనిపించనున్న చిత్రం కూడా ఇదే అని మేకర్స్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే విజయ్ దళపతి అభిమానులకు ఇదొక ఎమోషనల్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఇందులో రెండవసారి పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. గతంలోనే విజయ్ – పూజా కాంబినేషన్లో బీస్ట్ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా సరే ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద బాగా వర్క్ అవుట్ కావడంతో మళ్లీ పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.


మళ్లీ విజయ్ తో జత కట్టనున్న పూజా హెగ్డే..

ఇకపోతే విజయ్ దళపతి 69 సినిమా లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే నేషనల్ అవార్డు హీరోయిన్ ప్రియమణి , గౌతమ్ వాసుదేవ మీనన్, యాక్టర్ ప్రకాష్ రాజ్ తో పాటు, ప్రేమలు మూవీ తో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిన మమిత బైజు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

విజయ్ కెరియర్ లో మర్చిపోలేని చిత్రంగా..

హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే.వీ.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట కే నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరపై విలక్షణ నటనతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విజయ్ తన కెరియర్ లోనే చివరి సినిమా కావడంతో ఈ సినిమాకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో అటు మమిత ఇటు పూజా ఇద్దరూ కూడా హైలెట్ గా నిలిచారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తూ ఉండగా.. సత్యం సూర్యం సినిమాటోగ్రఫీ గా నిర్వహిస్తున్నారు. ప్రదీప్ ఈ రాఘవన్ ఎడిటింగ్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నట్లు సమాచారం.

విజయ్ 69 మూవీ విడుదల అయ్యేది అప్పుడే..

సెల్వ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పల్లవి సింగ్ కాస్ట్యూమ్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తెలుగు, తమిళ, హిందీలో ఈ సినిమాని 2025 అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. విజయ్ లెగసీని దృష్టిలో పెట్టుకొని విజయ్ నటించిన చివరి సినిమాను అత్యంత భారీగా తరతరాలు గుర్తు పెట్టుకునేలా తెరకెక్కించే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ చిత్రం విజయ్ కు జీవితంలో గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతామని మేకర్ స్పష్టం చేశారు. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

Related News

Roopa Ganguly: మహాభారత ‘ద్రౌపది‘ అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి రూపా గంగూలి, అసలు ఏం జరిగింది?

Salman Khan: ఆ హీరోయిన్ తో రొమాన్స్.. ఛీఛీ ఏం మాట్లాడుతున్నారు..

HarshaSai: హర్షసాయికి చుక్కెదురు.. బెయిల్ దొరకనట్టేనా..?

Devara Collections : బాక్సాఫీస్ వద్ద దేవర జాతర.. వారం రోజులకు ఎంత రాబట్టిందంటే ?

Posani Krishna Murali: చిరంజీవి ఏడ్చి మొత్తుకుంటే ఆపాను.. పవన్ కళ్యాణ్ ఏం పీకావ్ నువ్వు..

Pushpa2 : పుష్ప 2 లో బాలీవుడ్ బ్యూటీ.. నీ అవ్వ అస్సలు తగ్గేదేలే..

Big Stories

×