EPAPER

Veekshanam Movie Review : వీక్షణం మూవీ రివ్యూ…

Veekshanam Movie Review : వీక్షణం మూవీ రివ్యూ…

Veekshanam Movie Review : 


సినిమా : వీక్షణం
విడుదల తేదీ : 18 అక్టోబర్ 2024
నటీనటులు : రామ్ కార్తీక్, కశ్వి, చిత్రం శ్రీను, నక్షత్ర నైనా..  తదితరులు
దర్శకత్వం: మనోజ్ పల్లేటి
సంగీతం: సమర్ద్ గొల్లపూడి
సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
నిర్మాతలు: పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి

Veekshanam Movie Rating : 1/5


‘గీత సుబ్రహ్మణ్యం’ వంటి పలు వెబ్ సిరీస్..లతో పాటు రాంచరణ్ ‘ధృవ’ వంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి పాపులర్ అయ్యాడు రామ్ కార్తీక్. హీరోగా కూడా ‘రామ్ అసుర్’ వంటి సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. తాజాగా ‘వీక్షణం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ వారం వరుస పెట్టి రిలీజ్ అవుతున్న చిన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. మరి ఇది ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందో? నొప్పించే విధంగా ఉందో? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :
కారులో ఫంక్షన్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు ఓ కపుల్. ఇంతలో ఓ అమ్మాయి బిల్డింగ్ పై నుండి ఆ కారు పై పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పటికీ ఆమె ప్రాణాలు నిలబడవు. మరోపక్క ఓ ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ ద్వారా పక్కింట్లోకి తొంగి చూడటం అలవాటు. అతని ఫ్రెండ్స్ కి కూడా అదే పిచ్చి. అలా అతనికి నేహ(కశ్వి ) కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అయినా ఆ అలవాటు మానుకోడు హీరో. అలా చూస్తున్నప్పుడు మరో అమ్మాయి కనిపిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలు ఆ టైంకి రోజుకో అబ్బాయితో వస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆమె అమ్మాయితో కూడా రావడంతో డౌట్ వచ్చి.. హీరో బైనాకులర్స్ తో చూడగా.. ఆమె ఇంకో అమ్మాయిని చంపేస్తూ ఉంటుంది. తనతో వచ్చిన అబ్బాయిలను కూడా ఆమె అదే రీతిగా చంపేస్తూ ఉంటుంది. ఇది చూసిన హీరో అండ్ ఫ్రెండ్స్ షాక్ అవుతారు. వెంటనే పోలీసులకి ఈ విషయం చెప్పగా.. ఆ అమ్మాయి 8 నెలల క్రితమే చనిపోయిందని చెప్పి వీళ్ళకి ఇంకో షాక్ ఇస్తారు. మరి ఆ అమ్మాయి చనిపోతే.. ఈమె ఎవరు? ఎందుకు మర్డర్లు చేస్తుంది? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ ‘వీక్షణం’.

విశ్లేషణ :
క్రైమ్ థ్రిల్లర్స్ కి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్ గా తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారు. కానీ ఇప్పుడు ఓటీటీల్లో కూడా బోలెడన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. చాలా క్వాలిటీగా ఉంటున్నాయి. మరి ఇలాంటి టైంలో థ్రిల్లర్ సినిమా తీసే దర్శకులు ఎంతో శ్రద్ద పెట్టి తీయాలి. లేకపోతే వాటిని ఓటీటీల్లో చూడటానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడరు. ‘వీక్షణం’ కూడా ఆ రెండో రకానికి చెందిన సినిమానే. మొదటి 15 నిమిషాలకే సినిమా కథపై ఆడియన్ కి ఓ క్లారిటీ వచ్చేస్తుంది. కానీ హర్రర్ టచ్ ఇచ్చి డైవర్ట్ చేయాలని దర్శకుడు ట్రై చేశాడు. అది బెడిసికొట్టింది. అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా వేగం పుంజుకుంటుంది. మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. అయితే సెకండాఫ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకే మిగిలిన సినిమా పై కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడి నుండే వచ్చే సన్నివేశాలు ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించవు. క్లైమాక్స్ కూడా అంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్.. ఇలా ఎందులోనూ క్వాలిటీ కనిపించదు.

నటీనటుల విషయానికి వస్తే.. రామ్ కార్తీక్ లుక్స్ అయితే ఓకే. హీరోయిన్ కశ్వి లుక్స్ ఏమాత్రం ఇంప్రెసివ్ గా లేవు. ఆమె ఎంత గ్లామర్ వలకబోసినా ప్రేక్షకులు ఆకర్షితులు కారు. ఆమె కంటే విలన్ రోల్ చేసిన అమ్మాయి లుక్స్ బెటర్ గా ఉన్నాయి. హీరో ఫ్రెండ్స్ గా చేసిన వారిలో ఫణి(బమ్ చిక్ బంటీ) ఓకే. సమ్మెట గాంధీ, నాగ మహేష్..లు ఒక పూట కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారనుకుంట.. హడావిడిగా వాళ్ళ పాత్రలు ముగించారు. మిగిలిన నటీనటులు చెప్పుకోదగ్గ స్థాయిలో చేయలేదో లేక దర్శకుడు వాళ్ళని వాడుకోలేదో వాళ్ళకే తెలియాలి.

ప్లస్ పాయింట్స్ :

ప్రీ ఇంటర్వెల్ బ్లాక్
ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
స్క్రీన్ ప్లే
మ్యూజిక్

చివరిగా.. ‘వీక్షణం’ ఏమాత్రం ఆకట్టుకోని ఓ బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్. రెండు గంటల పాటు ఈ సినిమాని భరించడం కష్టమే

Veekshanam Movie Rating : 1/5

Related News

Anee Master: జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Most Handsome Hero: వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఇతడే.. షారుఖ్ స్థానం ఎంతంటే..?

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెట్ లో ఫోటోలు వైరల్

Kiran Abbavaram: సినిమాని తలపిస్తున్న హీరోగారి లవ్ స్టోరీ.. వింటే షాక్..!

Big Stories

×