EPAPER
Kirrak Couples Episode 1

Devara Event : ప్రభాస్‌ను చూసి నేర్చుకోండయ్యా…

Devara Event : ప్రభాస్‌ను చూసి నేర్చుకోండయ్యా…

Devara Event : ఆదివారం రాత్రి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సింది. హైదరాబాద్‌లో నోవాటెల్ లో ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే, అభిమానులు అనుకున్న దాని కంటే ఎక్కువ రావడంతో, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఒకేసారి ఫ్యాన్స్ అందరూ హాల్ లోకి రావడంతో ఫర్నిచర్ ధ్వంసం అయిపోయింది. దీంతో నిర్వహకులు చేతులెత్తేశారు. రిజెల్ట్ ఏంటంటే… ఎంతో గ్రాండ్ గా జరాగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అయితే రాత్రి జరిగిన వ్యవహారం మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ఓ హీరో గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అతనే ప్రభాస్…


బాహుబలి టైంలో ప్రభాస్ సినిమాలు లేట్ గా వచ్చేవి. కానీ, సాహో మూవీ తర్వాత నుంచి ఏడాది ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సినిమాలకు ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నారు. లాస్ట్ రెండు సినిమాలు సలార్, కల్కి. ఈ రెండు మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సలార్, కల్కి సినిమాలకు ప్రభాస్ చూపించిన ప్రమోషన్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అందరు హీరోల్లా… భారీ ఈవెంట్ లు ఏం చేయలేదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు అసలు చేయలేదు. కల్కి అయితే బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇక ఈవెంట్ చేశారు అంతే, ఇక ఎక్కడా కూడా భారీ ఈవెంట్స్ చేయలేదు. అయినా, ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.


Also Read : ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాస్.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్?

ఇలా ప్రభాస్ తన సినిమాలను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండా రిలీజ్ చేసిన తర్వాత… ఇతర తెలుగు హీరోలు కూడా ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించకుండా, సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చు కదా.. అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి దేవర ఈవెంట్ చూసిన తర్వాత ఇది మరీ ఎక్కువ అవుతుంది. సినిమా హిట్ అవ్వాలి అంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సిందేనా.? నిర్వహించకపోయినా, సలార్, కల్కి సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి కదా.. అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ హంగులు ఆర్భాటలు లేకుండా, ప్రభాస్ సినిమాల్లా రిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.

దేవర పెద్ద సినిమానే. హిట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువే ఉన్నాయి. ఈ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే హైప్ ఇంకా పెరుగుతుందని మూవీ టీం భావించొచ్చు. కానీ, ఆదివారం రాత్రి జరిగిన రచ్చ చూసిన తర్వాత, మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచనే రాకపోవచ్చు. అలాగే ఈవెంట్ కోసం ఇక నుంచి హల్స్ కూడా రెంట్‌కు ఇవ్వకపోవచ్చు. నోవాటెల్ లో గత రాత్రి జరిగిన విధ్వంసం వల్ల నష్టం ఎక్కువే జరిగి ఉంటుంది. దీని ఖర్చు ఎవరు భరిస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే, మరోసారి అయితే రెంట్ ఇచ్చే పరిస్థితులు అయితే ఉండవు.

Also Read : విధ్వంసం వెనుకకుట్ర కోణం… రంగంలోకి దిగిన పోలీసులు..

అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కాకుండా, ప్రమోషన్స్ కోసం ప్రత్యామ్నాయ పద్దతులు తీసుకోవడం బెటర్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇదే పని చేస్తున్నారు. అందుకే తెలుగు హీరోలు ఆయనను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అనే కామెంట్స్ వస్తున్నాయి.

Related News

Oscar 2025 : అఫిషియల్ గా ఆస్కార్ బరిలోకి అడుగు పెట్టిన “లాపతా లేడిస్”

Rajinikanth Coolie: తెలుగులో భారీ బిజినెస్.. థియేట్రికల్ రైట్స్ వారి సొంతం..!

Jani Master Issue : జానీ మాస్టర్ ఇష్యూ.. అల్లు అర్జున్ స్పందనపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్

Viswam : గోపీచంద్ కు 6 కోట్లా… మార్కెట్‌కి మించి రిస్క్ చేస్తున్నారా?

SSMB29 : మహేష్ బాబు మామూలుగా లేడు, లుక్కు చూస్తే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి

Kalki 2898AD: మళ్లీ వివాదంలో చిక్కుకున్న కల్కి.. గరికపాటి చురకలు..!

Big Stories

×