E-Paper
Advertisement

Tarakaratna : ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న పార్థివదేహం.. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

Tarakaratna : ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న పార్థివదేహం.. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
Advertisement

Tarakaratna : నందమూరి తారకరత్న పార్థివదేహన్ని మోకిల నుంచి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. ప్రజలు, అభిమానులు సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడ ఉంచారు. నందమూరి కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ లోనే ఉన్నారు. సినీ,రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు. బంధువులు, ఆత్మీయులు తారకరత్నను చివరిచూపు చూసి ఆవేదన చెందుతున్నారు. అతనితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

కుమారుడి పార్థివదేహం వద్ద తండ్రి మోహనకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అక్కడే కూర్చుని తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, పిల్లలు విలపిస్తున్నారు. తారకరత్నకు నివాళులర్పించేందుకు వస్తున్న ప్రముఖులు వారిని ఓదారుస్తున్నారు. బాలకృష్ణ, రామకృష్ణ, ఎంపీ విజయసాయిరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ వద్దే ఉన్నారు.

Advertisement

మధ్యాహ్నం 3 గంటల వరకు పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లోనే ఉంచతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తారకరత్న అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

జనవరి 27న నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18 రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని తెలుగు చలనచిత్ర పరిశ్రమతోపాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Advertisement

Taraka Ratna: తారకరత్న టాటూ స్పెష‌ల్‌ .. ఎవ‌రి కోస‌మో తెలుసా!

Kantara-2: ‘కాంతార-2’లో సూపర్‌స్టార్ రజినీకాంత్..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×