E-Paper
Advertisement

Taraka Ratna: ఒకేరోజు 9 సినిమాలకు సంతకం.. తారకరత్న కెరీర్ సాగిందిలా..

Taraka Ratna: ఒకేరోజు 9 సినిమాలకు సంతకం.. తారకరత్న కెరీర్ సాగిందిలా..

Taraka Ratna: తారకరత్న అనగానే వెంటనే గుర్తుకొచ్చేది “ఒకటో నెంబర్ కుర్రాడు”. తారకరత్న మొదటి సినిమా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ అది. ఇప్పటికీ ఆ టైటిల్ చాలామందికి గుర్తే ఉంటుంది. అంత గ్రాండ్ ఎంట్రీ మరి. సినిమా మాత్రం ఫ్లాప్. ఆ తర్వాత పలు చిత్రాలు వచ్చినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. మధ్యలో ‘అమరావతి’ మూవీలో విలన్గా చేసి మెప్పించారు. నంది అవార్డు కూడా సాధించారు. ఆ తర్వాత ‘మనసంతా’ సినిమా కూడా ఫర్వాలేదనిపించింది. లేటెస్ట్ గా ‘9 అవర్స్’ వెబ్ సిరీస్లో కొత్త లుక్లో కనిపించారు తారకరత్న. ఇలా ఆయన కెరీర్ ఒడిదొడుకులతోనే సాగిందని చెప్పాలి.

తారకరత్న గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. వింటే.. అవునా? అని ఆశ్చర్యపోతారు. చాలామందికి గుర్తే ఉంటుందనుకోండి. 20 ఏళ్ల వయసులో.. ఒకేసారి 9 సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడీ నందమూరి వారసుడు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఒకేసారి తొమ్మిది సినిమాలంటే మాటలా? అందుకే, అప్పట్లో అంతా అవాక్కయ్యారు. అది వరల్డ్ రికార్డ్ కూడా అన్నారు.

ఆ తొమ్మిది సినిమాల్లో మొదటిదే ఒకటో నెంబర్ కుర్రాడు. మిగతా 8 సినిమాల్లో చాలా వరకూ రిలీజ్ కాలేదు. కొన్నైతే షూటింగే మొదలవ్వలేదు. ఆ తొమ్మిదిలో ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు సినిమాలు వెండితెర మీదకు వచ్చాయి. అన్నీ ఫట్టే. ఒక్కటి కూడా హిట్ కాలే. తారకరత్న కెరీర్‌లో హిట్ అనేదేలే.

మొత్తం 21 సినిమాలు చేశారు. అమరావతి సినిమాలో విలన్ క్యారెక్టర్‌కు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు వరించడం విశేషం.

చాలాకాలం క్రితమే సినిమాలు మానేసిన తారకరత్న.. ప్రజెంట్ పొలిటికల్ ఎంట్రీ ప్లానింగ్‌లో ఉన్నారు. గన్నవరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవలే లోకేశ్‌ను కూడా కలిశారు. ఈక్రమంలోనే లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి వచ్చి.. తీవ్ర అస్వస్థతకు లోనై.. ఆసుపత్రిలో చేరారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.

Hansika: వ‌య‌సుకి మించి క‌న‌పడ‌టానికి హ‌న్సిక ఇంజెక్ష‌న్ష్ తీసుందా.. న‌టి రియాక్ష‌న్‌

Taraka Ratna: పెద్దలు నో చెప్పినా.. అలేఖ్యను పెళ్లాడిన తారకరత్న

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×