Big Stories

Tammareddy Bharadwaj : మా అమ్మా మొగుడు నాకు సంస్కారం నేర్పాడు.. నాగ‌బాబుపై త‌మ్మారెడ్డి ఫైర్‌

Tammareddy Bharadwaj

Tammareddy Bharadwaj : రెండు, మూడు రోజుల నుంచి RRR మూవీపై తాజాగా త‌మ్మారెడ్డి చుట్టూ నెల‌కొన్న వివాదం సంగ‌తి తెలిసిందే. నాగ‌బాబు, కె.రాఘ‌వేంద్ర‌రావు వంటివారు త‌మ్మారెడ్డిపై ఫైర్ అయ్యారు. నాగ‌బాబు అయితే నీ అమ్మా మొగుడు ఏమైనా ఖ‌ర్చు పెట్టాడురా రూ.80 కోట్లు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. అసూయ‌గా ఫీల్ అవుతున్నావా? అంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీనిపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ రియాక్ట్ అయ్యారు. ఘాటు వ్యాఖ్య‌లతో నాగబాబుపై ఫైర్ అయ్యారు త‌మ్మారెడ్డి.. నేనేం త‌క్కువ కాదు.. అనేలా నాగ‌బాబు తీరుని ద‌య్య‌బ‌ట్టారు మ‌న సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత‌.

- Advertisement -

‘‘మ‌నం ఏం మాట్లాడినా ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక‌టి అంటుంటారు. అయితే వాటిని దాన్ని నేను ప‌ట్టించుకోను. నేను సినీ ఇండ‌స్ట్రీకి ఎప్పుడూ బాధ్య‌త‌గా ఉంటాను. కాబ‌ట్టి దానికి నేను స‌మాధానం చెప్పాలని అనుకున్నాను. అయితే సినీ పరిశ్ర‌మ‌కి చెందిన కొంత మంది పెద్ద‌వాళ్లు దీనిపై ట్వీట్ చేయ‌టం చూసి వివ‌ర‌ణ ఇవ్వ‌కూడ‌ద‌నిపించింది. ఎందుకంటే నేనేం త‌ప్పు చేయ‌లేదు. కాబట్టి నేను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ను.

- Advertisement -

నేను ఆరోజు మూడు గంట‌ల సెమినార్‌లో మాట్లాడాం. అందులో చిన్న సినిమాలు తీసేవాళ్లంద‌రూ వ‌చ్చారు. అందులో యంగ్ డైరెక్ట‌ర్స్‌ కూడా ఉన్నారు. మ‌న సినిమా స్థాయిని బ‌ట్టి, సినిమా బ‌డ్జెట్‌ను బ‌ట్టి సినిమా చేసుకోవాల‌ని వివ‌రించాను. తీసే అన్నీ సినిమాలు రిలీజ్ కావు. థియేట‌ర్స్ దొర‌క‌వు. అవార్డులు రావు. ఫెస్టివ‌ల్స్‌కి ఎలా వెళ్లాలి.. ఏం చేయాల‌నే డిస్క‌ష‌న్ జ‌రిగింది. ఆ సంద‌ర్బంగా భారీ చిత్రాల‌కు, చిన్న చిత్రాల‌కు న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంటుందని, పులిని చూసి న‌క్క వాత‌లు పెట్టుకోకూడ‌దంటూ కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌కు కూడా చెప్పాం. RRR, KGF 2 వంటి సినిమాల‌ను చూస్తాం. కానీ తీయాలంటే అంత సుల‌భం కాదు. అని వివ‌రించాను. అదే స‌మ‌యంలో ఎలాంటి తేడాలు వ‌చ్చే అవకాశం ఉందో కూడా వివరించాను.

RRR గురించ ఈరోజు న‌న్ను అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు. అయితే దీనికి రెండు రోజుల ముందు నేను రాజ‌మౌళిని మెచ్చుకున్నాను. దాని గురించి ఎవ‌రూ మాట్లాడ‌రు. ఇండ‌స్ట్రీలో పెద్ద‌వాళ్ల‌మంటూ చెప్పుకునేవాళ్లు కొంద‌రు ట్వీట్ చేశారు. నీకు లెక్కలు తెలుసా! అని మాట్లాడారు. రాజ‌మౌళిని చూసి నేను జెల‌సీగా ఫీల్ అవుతున్నాన‌ని అన్నారు. అస‌లు నేను ఆయ‌న్ని చూసి జెల‌సీ ఫీల్ అవ‌టానికి నేను ఆయ‌న కాలానికి చెందిన ద‌ర్శ‌కుడిని కాదు.. అలాగే ఆయ‌నతో స‌మానంగా సినిమాలు తీసేవాడిని కాదు. రాజ‌మౌళిపై నాకెందుకు అసూయ‌. నేనేదో కృష్ణా, రామా అని బ్ర‌తుకుతున్నాను. వాళ్లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. అయితే అది బ‌య‌ట వ్యక్తులంటే పెద్ద‌గా ప‌ట్టించుకోను. కానీ.. ఇండ‌స్ట్రీలో పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణి అవుతున్న‌వారు న‌న్ను మాట్లాడారు.

నాకేం లెక్క‌లు తెలియ‌న‌క్క‌ర్లేదు. అయితే చాలా మంది లెక్క‌లు నాకు తెలుసు. ఎవ‌డెవ‌డు ఎవ‌డెవ‌డ్ని ఏ అవార్డుల కోసం ఏం అడుక్కున్నారో, ఏ ప‌ద‌వుల కోసం ఏం అడుక్కున్నారో, ఎవ‌డెవ‌డి కాళ్లు ప‌ట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. ఇవ‌న్నీ మాట్లాడి ఇండ‌స్ట్రీ ప‌రువు రోడ్డు మీద వేయ‌టం నాకు ఇష్టం లేదు. కానీ నేనెప్పుడూ ఆ ప‌ని చేయ‌లేదు అన్నం పెట్టిన ఇండ‌స్ట్రీని గౌర‌విస్తాను కాబ‌ట్టి నేను ఎప్పుడూ ఏదీ మాట్లాడ‌ను. ఒక‌డైతే నీ య‌మ‌మ్మా మొగుడు అని ఒక‌డంటాడు.. మా అమ్మా మొగుడు నాకు మ‌ర్యాదు నేర్పించాడు. మా అమ్మా మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నీతిగా బ‌త‌క‌టం నేర్పించాడు. నిజం చెప్ప‌టం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు తెలుసా? నిజ‌మేంటో మీరు చెప్ప‌గ‌ల‌రా? కులాలు, మ‌తాలు గురించి మాట్లాడే మీరా నా గురించి మాట్లాడేవాళ్లు. మీకు హ‌క్కు ఉందా అలా మాట్లాడ‌టానికి. ఇప్ప‌టికీ ఇంకేమైనా మాట్లాడాలంటే సంస్కారం అడ్డొస్తుంది. నేను చాలా బూతులు మాట్లాడొచ్చు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ అయిన రాజేష్ ట‌చ్ రివ‌ర్ అనే ద‌ర్శ‌కుడుకి సంబంధించిన సెమినార్ జ‌రుగుతుంటే మేం మూడు గంట‌లు కూర్చున్నాం. అన్నీ గంట‌లు ఏం మాట్లాడామ‌నే చూసే ఓపిక లేదు మీకు. మూడ గంట‌ల్లో ఒక‌టి ఎడిట్ చేసి పెట్టేస్తే దాన్ని చూసి మీరు ట్వీట్ చేసి ఒక‌డ్ని తిట్టేస్తే అయిపోతుంది. మీరు న‌న్ను తిట్టారు చూడండి మీకు సిగ్గుండాలి. నాకెందుకు సిగ్గు. నేనేం త‌ప్పు చేయ‌లేదు. నేను నోరు విప్పితే చాలా ఉంటాయి. ఆ అవ‌స‌రం నాకు లేదు. ఎందుకంటే ఇండ‌స్ట్రీ అంతా ఒక‌టే. మ‌న‌మంతా ఒక‌టే అని ఇంత‌కాలం ఫీల్ అయ్యాను. ఇప్పుడూ ఫీల్ అవుతున్నాను. మీకు సిగ్గులేక‌పోవ‌చ్చు. నాకు సిగ్గు, మానం, అభిమానం అన్నీ ఉన్నాయి.

న‌న్ను కెలికినా నేనే ప‌ట్టించుకోను. ఎందుకంటే నాకు ఇండ‌స్ట్రీ అనేది అన్నం పెట్టింది. నేను ఈరోజు మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడితే ఇండ‌స్ట్రీ గురించి బ్యాడ్‌గా మాట్లాడిన‌ట్లే. నిన్న‌గాక మొన్న నేను రాజ‌మౌళిగారు గొప్ప‌వాడ‌న్న‌ప్పుడు మీకది తెలియ‌లేదా? ఎవ‌డో ముక్క క‌ట్ చేసి పెడితే తెలిసిందా? ఓ చిన్న సినిమా కోసం మీరెవ‌రైనా మూడు గంట‌ల టైమ్ స్పెండ్ చేయ‌గ‌ల‌రా? మీకు వాడికి వీడికి మ‌ర్ద‌న చేయ‌టానికి త‌ప్ప దేనికి టైమ్ ఉంది. వాడి కాళ్లు ప‌ట్టుకోవ‌టం, వీడి కాళ్లు ప‌ట్టుకోవ‌టం త‌ప్ప మీకేమైనా టైమ్ ఉందా? మీరా నా గురించి మాట్లాడేది. సందు దొరికింది క‌దా అని ఎవ‌డో ఒక‌డి మీద బుర‌ద చల్ల‌టం నాకు అల‌వాటు లేదు. నిజాయ‌తీగానే ఉంటాను. నిజాయ‌తీగానే బ్ర‌తికాను.. అలాగే చ‌చ్చిపోతాను’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News