EPAPER

Simbu: తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. పెద్దమనసుతో సాయం చేసిన తమిళ హీరో శింబు

Simbu: తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. పెద్దమనసుతో సాయం చేసిన తమిళ హీరో శింబు

Tamil Actor Simbu : ఇటీవల భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీని కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు ప్రజలను భయపెట్టాయి. ఈ ప్రకృతి విపత్తి కారణంగా అసలు ఎంత నష్టం వాటిళ్లిందో అంచనాలకు కూడా అందడం లేదు. ఇళ్లల్లోకి నీల్లు వచ్చేశాయి.


ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తినడానికి తిండి కూడా కరువైంది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో కుటుంబాలు విలవిలాడిపోయాయి. పశువులు వరద తీవ్రతకు కొట్టుకుపోయాయి. వాహనాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికే ఇదే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఎంతో మంది ప్రజలు సాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రముఖ రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి టాలీవుడ్ నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు, చిన్న హీరోలు తమవంతు సాయంగా ఆర్థిక సాయం అందజేశారు. టాలీవుడ్ నుంచి దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, నాగవంశీలు సంయుక్తంగా కలిసి తమవంతు సాయంగా రెండు రాష్ట్రాలకు రూ.50 లక్షలు అందజేశారు. అందులో ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకి రూ.25 లక్షలు ప్రకటించారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి చెరో రూ.15 లక్షలు ప్రకటించాడు.


Also Read: తెలుగు రాష్ట్రాలకు చేయూత.. విరాళాలు ఇచ్చిన సెలబ్రిటీలు వీళ్లే!

అలాగే వైజయంతీ మూవీస్ బ్యానర్‌ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు ప్రకటించింది. జూ. ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ 1 కోటి విరాళంగా ప్రకటించారు. అలాగే విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఆయ్ మూవీ యూనిట్ సైతం విరాళం ప్రకటించింది. ఇంకా అనన్య నాగళ్ల కూడా తమ వంతు సాయంగా డొనేట్ చేశారు. ఇలా టాలీవుడ్ నుంచి మరెంతో మంది నటీ నటులు తమకు తోచిన సాయాన్ని అందజేశారు.

ఇతర ఇండస్ట్రీలకు ఏమైంది? 

కానీ ఇతర ఇండస్ట్రీల నుంచి మాత్రం ఒక్క చేయి కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఏ రాష్ట్రాలో విపత్తు జరిగినా టాలీవుడ్ నుంచి భారీగా విరాళాలు వెళ్తాయి. తమకు తోచిన సాయాన్ని టాలీవుడ్ హీరో హీరోయిన్లు ప్రకటిస్తూ ఉంటారు. అంతెందుకు ఇటీవలే కేరళ రాష్ట్రం వయనాడ్‌లో భారీ ప్రకృతి విపత్తు జరిగింది. దీనికోసం టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వంతు సాయంగా భారీగా విరాళాలు ప్రకటించారు. అంతేకాకుండా వీలున్నంత వరకు కేరళ వెళ్లి మరీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్కులను అందించారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు విపత్తు వస్తే ఒక్క హీరో, హీరోయిన్ ఆర్థిక సాయం కాదు కదా.. కనీసం విపత్తుపై స్పందించలేదు. దీంతో చాలా మంది ఇతర ఇండస్ట్రీలపై టాలీవుడ్‌కే ఎందుకంత ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తమిళ ఇండస్ట్రీ నుంచి తొలి సాయం

ఇలా పలు ఇండస్ట్రీల నుంచి ఒక్క సాయం కూడా ముందుకు రాకపోవడంతో ఎన్నో వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఓ ఇండస్ట్రీ నుంచి తొలి చేయి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తమిళ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో శింబు తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.6 లక్షల విరాళం ప్రకటించాడు. దీంతో విరాళం ప్రకటించిన తొలి తమిళ హీరోగా శింబు నిలిచాడు. ఇకపై చూడాలి ఇంకెవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తారో లేదో

 

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×