EPAPER
Kirrak Couples Episode 1

Vijayakanth : వెండితెర కెప్టెన్ ఇకలేరు.. ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూత..

Vijayakanth : వెండితెర కెప్టెన్ ఇకలేరు.. ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూత..

Vijayakanth : ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కొద్దిరోజుల క్రితమే కరోనా సోకింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్‌.. పార్టీ సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మరణంతో అభిమానులు, కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సెప్టెంబర్ 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఇక డిసెంబర్ 11న ఆయన డిశ్చార్జి అయిన అనంతరం ఓ బహిరంగ సభలో పాల్గొన్న విజయ్ కాంత్ కదలలేని స్థితిలో కనిపించడం పట్ల అభిమానులంతా ఆవేదన వ్యక్తం చేశారు.


విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయ్ కాంత్ అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. 1979లో విడుదలైన ఇనికి ఇలమై సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టారు. 1980లలో విజయకాంత్ యాక్షన్ హీరో స్థాయికి ఎదిగారు.

ఇక తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ తిరుగులేని విజయాన్ని అందించి.. స్టార్ హీరోగా చేసింది. ఈ సినిమాతో అభిమానులు ఆయన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. 154 సినిమాల్లో విజయ్ కాంత్ నటించగా.. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం విరుదగిరి. 2010లో విడుదలైన ఈ సినిమాకు…. ఆయనే దర్శకత్వం వహించారు. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండియన్ నటించిన సాగపథం సినిమాలో కూడా అతిథి పాత్రలో కనిపించారు విజయ్ కాంత్.

వెండితెరపై హీరోగా సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన… 2005లో రాజకీయ పార్టీని స్థాపించారు. 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Related News

Zeenat Aman: అనసూయ విన్నావా.. ఆంటీ అంటే బూతు కాదంట, సీనియర్ నటి కామెంట్స్

Suchithra: ఆ లెజెండరీ డైరెక్టర్ పెద్ద కామ పిశాచి.. చచ్చే వరకు ఎవరిని వదలలేదు

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Big Stories

×