EPAPER

Tamannaah: హీరోయిన్ తమన్నాను విచారించిన ఈడీ, అరెస్ట్ తప్పదా?

Tamannaah: హీరోయిన్ తమన్నాను విచారించిన ఈడీ, అరెస్ట్ తప్పదా?

Tamannaah: హీరోయిన్ తమన్నాకు కష్టాలు తప్పవా? ఎందుకు ఆమెని ఈడీ విచారించింది? యాప్ స్కామ్‌లో కూరుకుపోయిందా? ఈడీ నిఘా వేసిన ప్రముఖుల్లో తమన్నా ఉందా? ఇవే ప్రశ్నలు సినీ లవర్స్‌ని వెంటాడుతున్నాయి. అసలేం జరిగింది?


బాలీవుడ్‌ని మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఈడీ, వారిచ్చిన సమాచారం ఆధారంగా ఒక్కొక్కర్నీ విచారణకు పిలిపిస్తోంది. ఇందులో భాగంగా సౌత్ ఫేమస్ హీరోయిన్ తమన్నాను గురువారం విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌పై ఈడీ విచారణ మొదలుపెట్టి ఏడాది పైగానే అవుతోంది. ఇప్పటికే నటుడు రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్‌లను విచారించింది. గురువారం హీరోయిన్ తమన్నా వంతైంది. తన తల్లితో కలిసి గౌహతిలోని ఈడీ ఆఫీసుకు వెళ్లింది. విచారణకు హాజరైంది. అంతర్గత వర్గాల సమాచారం మేరకు తమన్నా దాదాపు ఎనిమిది గంటల సేపు అధికారులు విచారించినట్టు తెలుస్తోంది.


విచిత్రం ఏంటంటే ఈ యాప్‌తో తమన్నాకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే యాప్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన షోలకు హాజరైంది. ఇందుకుగాను కొద్ది మొత్తంలో నిధులు తీసుకుందన్నది సినీ వర్గాల మాట.

ALSO READ:  గ్లోబల్ స్టార్ కి పట్టుకున్న ఓటమి భయం… పరువు పోగొట్టుకోవాల్సిందేనా…?

ఆన్‌లైన్ గేమింగ్ యాప్ చట్ట విరుద్దమైనదప్పటికీ దీన్ని తమన్నా ప్రచారం చేశారని బలంగా నమ్ముతోంది ఈడీ. ఈ కేసు విచారణకు సంబంధించి అనేకసార్లు సమన్లు జారీ చేశారు అధికారులు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెళ్లలేకపోయింది. ఈ వ్యవహారం ఎప్పుడైనా తన మెడకు చుట్టుకునే అవకాశముందని భావించిన తమన్నా, గురువారం గౌహతి వెళ్లింది.

బెట్టింగ్ యాప్ డీటేల్స్‌లోకి ఇంకా లోతుగా వెళ్తే.. బెట్టింగ్ యాప్ ఉచ్చులోకి సామాన్యులను ఆకట్టుకునేందుకు సినీ తారలతో ప్రమోట్ చేయించారు నిర్వాహకులు. ఇందులో 10 మంది డైరెక్టర్లు చైనాకు సంబంధించిన వారు ఉన్నట్లు అంతర్గత సమాచారం. ఈ యాప్ కేంద్రంగా చాలా సంస్థలు పని చేస్తున్నాయి. యాప్‌ లో కొంత మొత్తం పెట్టుబడి పెడితే ప్రతీ రోజూ ఆదాయం వస్తుందనేది అసలు థీమ్.

కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడానికి హెచ్‌పీజెడ్ టోకెన్ అనే యాప్‌ని వినియోగించారన్నది పోలీసుల వెర్షన్. వసూలు చేసిన డబ్బును క్రిప్టో, బిట్ కాయిన్లలో పెట్టుబడి పెట్టారు. దీనికి సంబంధించి వందల కోట్ల రూపాయలు, ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.

 

Related News

Big TV Exclusive news about Pushpa: పుష్ప సినిమాలో డైలాగ్ మాదిరిగానే నాగవంశీ అసలు తగ్గట్లేదు

Salman Khan: పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు, ఐదు కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం

Diwali Films : అమరన్ అంతంత మాత్రమే, దివాలి విన్నర్ డిసైడ్ అయిపోయింది

Game Changer : గ్లోబల్ స్టార్ కి పట్టుకున్న ఓటమి భయం… పరువు పోగొట్టుకోవాల్సిందేనా…?

Unstoppable Season 4 :అన్ స్టాపబుల్ సీజన్ 4 కు గెస్టులు గా ఏపీ పొలిటీషియన్స్ .. ఎవరంటే ?

Ram Gopal Varma : ఏందయ్యా వర్మా .. మరో రచ్చకు కథ సిద్ధం చేస్తున్నావా ?

Big Stories

×