BigTV English

Samantha : స‌మంతతో మాట్లాడుతుంటాను: రానా

Samantha : స‌మంతతో మాట్లాడుతుంటాను: రానా
Samantha :

Samantha : అక్కినేని ఫ్యామిలీకి, ద‌గ్గుబాటి ఫ్యామిలీనిక ద‌గ్గ‌రైన హీరో ఎవ‌రైనా ఉన్నారా? అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు నాగ చైత‌న్య‌. ఈయ‌న్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత నాలుగేళ్ల త‌ర్వాత విడిపోయింది. ఎంతో అన్యోనంగా ఉండే వారిద్ద‌రూ విడిపోతార‌ని ఎవ‌రూ అనుకోలేదు. కానీ విడిపోయారు. ఇది జ‌రిగి దాదాపు రెండేళ్లు అవుతుంది. దీని గురించి సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, స‌మంత ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా మారిపోయారు. స‌మంత విష‌యానికివ వ‌స్తే మియో సైటిస్ బారిన ప‌డిన ఆమె మ‌నోధైర్యంతో బౌన్స్ బ్యాక్ అయ్యింది. స‌మంత గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో రానా మాట్లాడిన విష‌యాలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.


ఇంత‌కీ రానా స‌మంత గురించి ఏమ‌న్నారు? ఆయ‌న ఎందుకు మాట్లాడాల్సి వ‌చ్చింద‌నే వివ‌రాల్లోకి వెళితే, ఈ మ‌ధ్య కాలంలో న‌టీనటుల వారి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌పై బాహాటంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్‌. దీనిపై స్పందిస్తూ రానా ‘‘నేను అప్పుడప్పుడు, నాకు వీలున్నప్పుడు సమంతకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. ఆమె మియో సైటిస్ బారిన ప‌డ్డ‌ప్ప‌డు ఆమెకు ఫోన్ చేసి యోగ క్షేమాలు క‌నుక్కున్నాను. ప్ర‌తి ఒక్క‌రీ జీవితంలో క‌ష్ట సుఖాలుంటాయి. అయితే వాటిని వాళ్లు బ‌య‌ట‌కు చెప్పాలా లేదా? అనేది వారికి సంబంధించిన విష‌యం. ప్ర‌తి ఒక్క‌రి జీవితాన్ని మార్చే విష‌యం ఒక‌టి ఉంటుంది. అలాగే బాధ పెట్టే విష‌యం కూడా ఒక‌టి ఉంటుంది. అయితే స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు భ‌య‌ప‌డ‌కుండా వాటిని ఎలా అధిగ‌మించి ముందుకు వెళ్లామ‌నేది ముఖ్యం’’ అన్నారు.

రానా త‌న బాబాయ్ వెంక‌టేష్‌తో క‌లిసి న‌టించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. రే డొనోవ‌న్ అనే అమెరిక‌న్ సిరీస్‌కు ఇది రీమేక్‌. తొలిసారి బాబాయ్.. అబ్బాయి ఫుల్ లెంగ్త్ పాత్ర‌ల్లో క‌లిసి న‌టించారు. మ‌రెలా మెప్పిస్తారో తెలియాలంటే మార్చి 10 వ‌ర‌కు ఆగాల్సిందే.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×