EPAPER

Swag: థియేటర్ లో ప్లాప్ చేసి.. ఓటీటీకి వచ్చాక ఎవడు ప్లాప్ చేశార్రా అంటారేంటి సుధా వీళ్లు

Swag: థియేటర్ లో ప్లాప్ చేసి.. ఓటీటీకి వచ్చాక ఎవడు ప్లాప్ చేశార్రా అంటారేంటి సుధా వీళ్లు

Swag:  ఓటీటీ వచ్చాకా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ విషయాన్నీ నిర్మాతలు సైతం ఒప్పుకున్నారు. అంతంత డబ్బు టికెట్స్ కు పెట్టి.. సినిమా చూసి రావడం కంటే.. ఓటీటీకి వచ్చాక కుటుంబంతో సహా కూర్చొని చూడొచ్చు అనుకుంటున్నారు.   స్టార్ హీరోల సినిమాలు తప్ప.. మిగతా సినిమాలకు మొదటి షో పడిన వెంటనే హిట్టా.. ? ఫట్టా.. ? అని చూస్తున్నారు.


ప్లాప్ టాక్ వచ్చినా.. మిక్స్డ్ టాక్ వచ్చినా.. హా.. ఇప్పుడు ఈ సినిమా కోసం థియేటర్ కు వెళ్లాలా.. ?  ఓటీటీకి వచ్చాకా చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారు. దీనివలన థియేటర్ లో ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు మిస్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఇంకొంతమంది మాత్రం.. ఎన్నో అంచనాలను పెట్టుకొని సినిమాకు వెళ్లి.. ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా లేదని నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. అదే సినిమా ఓటీటీకి వచ్చినప్పుడు మళ్లీ చూసి.. అప్పుడు  నచ్చలేదు.. ఇప్పుడేంట్రా ఇంత బావుంది అని చెప్పుకొస్తున్నారు.

Rukmini Vasanth: ఎన్టీఆర్ తో రొమాన్స్.. అంత మాట అనేసిందేంటీ..?


ఇలా థియేటర్ లో ఫెయిల్ అయ్యి.. ఓటీటీలో ట్రెండ్ సృష్టించిన  సినిమాలు చాలా  ఉన్నాయి.  తాజాగా ఆ లిస్ట్ లోనే  మరో సినిమా చేరింది. అదే స్వాగ్. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ..  విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు  హీరోగా  హసిత్ గోలి దర్శకత్వం వహించిన స్వాగ్ సినిమా ఈ నెల 4 న రిలీజ్ అయ్యింది. మొదట నుంచి ఈ సినిమాపు బజ్ లేదు. శ్రీవిష్ణు కూడా ఎక్కువ ప్రమోషన్స్ చేసినట్లు కూడా కనిపించలేదు. కానీ, ఆయన పాల్గొన్న ఇంటర్వూస్ లో మాత్రం సినిమా కంటెంట్ బావుంటుందని, చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇక స్వాగ్ చూసిన ప్రేక్షకులు మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను ఇచ్చారు.  కొంతమంది సినిమా బావుంది చూడొచ్చు అంటే.. ఇంకొంతమంది అసలేం లేదు.. దీనికన్నా శ్రీవిష్ణు నటించిన ఓం భీమ్  బుష్ నే బావుందని పెదవి విరిచారు. ఇంకొందరు అసలు కథనే చాలా కన్ఫ్యూజన్ గా ఉందని, అర్ధం కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో స్వాగ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.. చివరికి కలక్షన్స్  కూడా రాబట్టలేకపోయింది. ఇక చేసేదేమి లేక మేకర్స్.. స్వాగ్ సినిమాను ఓటీటీకి ఇచ్చేశారు.

Jani Master: కన్నబిడ్డలను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన జానీ మాస్టర్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

అమెజాన్ ప్రైమ్ లో స్వాగ్ నిన్నటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక  ఓటీటీలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. సినిమా సూపర్ ఉందని, శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా లేడీ గెటప్ లో శ్రీవిష్ణు కనిపించిన క్లిప్స్ ను పోస్ట్ చేస్తూ.. టిఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ (TFI Failed Here) అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. డైరెక్టర్ గొప్ప కథను రాసుకున్నాడని, సినిమా చాలా బావుందని చెప్పుకొస్తున్నారు.

ఇక ఇదంతా చూసిన నెటిజన్స్.. థియేటర్ లో ప్లాప్ చేసి.. ఓటీటీకి వచ్చాక ఎవడు ప్లాప్ చేశార్రా అంటారేంటి సుధా వీళ్లు అంటూ సరిపోదా శనివారం సినిమాలోని సూర్య డైలాగ్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మరి థియేటర్ లో ఫెయిల్ అయిన ఈ స్వాగ్.. ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×