Suriya: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ లో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సాధించుకున్నారు సూర్య. చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా సూర్యను అడాప్టెడ్ తెలుగు సన్ అని అంటూ ఉంటారు. సూర్య చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి గుర్తింపును సాధించుకున్నాయి. నువ్వు నేను ప్రేమ (Nuvvu Nenu Prema), గజిని (Gajini), వీడొక్కడే (Veedokkade), ఘటికుడు (Ghatikudu) వంటి ఎన్నో సినిమాలు ఆ రోజుల్లోనే సూర్యకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం కంగువ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సూర్య. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది.
Also Read : Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు
శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఈ సినిమా మరో బాహుబలి అవుతుంది అనే అందరూ భావిస్తున్నారు. నిర్మాత జ్ఞాన వేల్ రాజా కూడా ఈ సినిమాకు సంబంధించి దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కొన్ని అనివార్య కారణాల వలన నవంబర్ 14 వ తారీకుకి పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్ కూడా చాలా జోరుగా చేస్తుంది ఈ చిత్ర యూనిట్. పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సూర్య.
Also Read : Rana comments on Mr Bachchan: లాస్ట్ కి అవార్డు తీసుకునే స్టేజ్ మీద కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రోలెక్స్ క్యారెక్టర్ గురించి రివీల్ చేశాడు సూర్య. రోలెక్స్ క్యారెక్టర్ లో పాజిటివ్ సైడ్ ఉంటుందా అని ఒక వ్యక్తి అడగగానే, రోలెక్స్ క్యారెక్టర్ లో అసలు పాజిటివ్ సైడ్ ఉండదు. అలా పాజిటివ్ సైడ్ ఉండడానికి ఆస్కారం కూడా లేదు. రోలెక్స్ క్యారెక్టర్ అనేది అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని రీవీల్ చేశాడు సూర్య. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ కమల్ హాసన్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో, ఈ సినిమాను డిజైన్ చేసి కమల్ కెరియర్లో హైయెస్ట్ రెవెన్యూ తీసుకువచ్చేలా చేసాడు లోకేష్. ఈ సినిమాలో రోలెక్స్ పాత్ర ఎంత పెద్దగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోల్ ని కంప్లీట్ గా చూడడానికి ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో కూడా ఎదురు చూస్తున్నారు.