Suriya : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కార్తీ కు దక్కిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి కార్తీ తమిళ్ హీరో అనే ఫీల్ కూడా రాదు. తెలుగు కూడా అంత చక్కగా మాట్లాడుతాడు. చాలా సందర్భాలలో నాకు తెలుగు ఆడియన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక కార్తీ నటన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీ ఏ పాత్ర చేసినా కూడా మనకు బాగా కావలసిన వ్యక్తి ఆ పాత్రలో జీవిస్తున్నాడు అనిపించేలా ఉంటుంది. కార్తీ ఒక సీన్ లో నవ్వితే నవ్వాలి, కార్తీ ఒక సీన్ లో ఏడిస్తే ఏడవాలి అంతగా ప్రేక్షకుడను కదిలించగలిగే నటుడు. కార్తీ చేసిన ఎన్నో సినిమాలు కి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కార్తీ రీసెంట్ గా నటించిన సత్యం సుందరం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచింది. హ్యూమన్ వాల్యూస్ని చాలా అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాడు సి ప్రేమ్ కుమార్. ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు. ఒక మామూలు కథని మనసుకు హత్తుకునేలా డిజైన్ చేయొచ్చు అని వెండితెరపై చూపించడం సి ప్రేమ్ కుమార్ కి మాత్రమే చెల్లింది అని చెప్పాలి. ఇప్పటివరకు ప్రేమ్ కుమార్ చేసిన రెండు సినిమాలు కూడా మనసును హత్తుకునేలా ఉంటాయి. కళ్ళు చెమ్మగిల్లేలా అనిపిస్తుంటాయి. అటువంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే కార్తీ పర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కార్తీ నటించిన సుందరం పాత్రను చూస్తే మన జీవితంలో కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే ఎంత బాగుందో అనే ఫీలింగ్ వస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి.
ఇక ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమా కంగువ. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించాడు. సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విపరీతంగా పాల్గొంటున్నాడు సూర్య. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫంక్షన్ హైదరాబాదులో జరిగింది. రీసెంట్ గా కూడా ఈ సినిమాకి సంబంధించిన ఫంక్షన్ వైజాగ్ లో చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి గెస్ట్ గా హాజరయ్యాడు సూర్య. ఈ సోలో సూర్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. షో లో సూర్య మాట్లాడుతూ కార్తీ ని చూస్తే నాకు జలస్ ఫీలింగ్ వస్తుంది. వాడు తెలుగు చాలా బాగా మాట్లాడుతాడు. నేను వాడిలా మాట్లాడలేను. వాడు స్కూల్ లో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటూ కార్తీ గురించి మాట్లాడారు సూర్య. ఒక సూర్యని కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయం మరోసారి కంగువ ప్రమోషన్స్ లో కూడా ప్రూవ్ అయింది.