EPAPER

Suriya : అందరి హీరోల మీద అభిప్రాయాన్ని చెప్పేసాడు

Suriya : అందరి హీరోల మీద అభిప్రాయాన్ని చెప్పేసాడు

Suriya : సౌత్ సినిమా ఇండస్ట్రీలో సూర్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా సూర్యని ఓన్ చేసుకుంటారు అని చెప్పాలి. ముఖ్యంగా చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియని విషయం సూర్య ఒక తమిళ్ నటుడు అని, అంతలా తెలుగు ప్రేక్షకులు సూర్యని ప్రేమించడం మొదలుపెట్టారు. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను సూర్య అందించారు. రీసెంట్ గా సూర్య ప్రొడ్యూస్ చేసిన సత్యం సుందరం సినిమా కూడా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీ లో చూసిన చాలామంది ఈ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తుంది చిత్ర యూనిట్. హైదరాబాద్ వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ జరిగిన ఈ సినిమా ఈవెంట్లో చాలామంది తెలుగు నటుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సూర్య. ప్రభాస్ గురించి మాట్లాడుతూ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. కల్కి సినిమా నాకు బాగా నచ్చింది. ఈగర్ లీ వెయిటింగ్ ఫర్ కల్కి టు అంటూ చెప్పుకోచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రియల్ లైఫ్ లోని రీల్ లైఫ్ లోని ఆయన ఒకేలా ఉంటారు ఇస్ క్యాండేడ్ అండ్ ఓపెన్ హార్టెడ్ అంటూ తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. మీ ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాము తను నాకంటే జూనియర్ తను ఒక డిఫరెంట్ లీగ్ లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నేను ఆయన డాన్స్ లకి చాలా పెద్ద ఫ్యాన్ పుష్ప టు కోసం ఎదురుచూస్తున్నాను తెలిపారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ కేవలం 15 సినిమాల్లో మాత్రమే నటించాడు. ఆయన ఆల్రెడీ గ్లోబల్ స్టార్, గ్లోబల్ యాక్టర్ నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంటూ తెలుపుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ లా తెలుగు డిక్షనని ఎవరు మాట్లాడలేరు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అంటూ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ నేను నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాకు చాలా మెసేజెస్ విషెస్ ట్విట్టర్ వేదికగా వచ్చాయి. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను ఎన్జీవో చెన్నైలో స్టార్ట్ చేయడానికి ఆయనే ముఖ్య కారణం అంటూ తెలిపారు. పేరుకి తమిళ నటుడు అయినా కూడా ఎంతమంది తెలుగు హీరోల వర్క్ ని ఫాలో అవుతూ ప్రేమిస్తున్నాడు అంటే తెలుగు ప్రేక్షకులు సూర్య అని ప్రేమించకుండా ఉంటారా.? అందుకే సూర్య అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులు విపరీతమైన ఇష్టం చూపిస్తూ ఉంటారు.


Related News

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

×