EPAPER

Suriya: భలే రీ క్రియేట్ చేసి ప్రేమను ప్రేక్షకులకు విసిరాడు

Suriya: భలే రీ క్రియేట్ చేసి ప్రేమను ప్రేక్షకులకు విసిరాడు

Suriya: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వాస్తవానికి సూర్య తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సూర్యాకి ఉంది. సూర్య చేసిన ఎన్నో సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ అయ్యాయి. అయితే సూర్యని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య చేసిన ఎన్నో మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నువ్వు నేను ప్రేమ, ఆరు, గజిని,వీడొక్కడే, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి ఎన్నో సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చాలామందికి సూర్య తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో అని కూడా తెలియదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతలా తెలుగు ప్రేక్షకుల్లో కలిసిపోయాడు.


ఇక ప్రస్తుతం సూర్య కంగువ (Kanguva) అనే ఒక పాన్ ఇండియా సినిమాను చేశాడు. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రతి చోట కూడా ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నాడు సూర్య. ముఖ్యంగా తెలుగులో సూర్య ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలామంది సీనియర్ ఫిలిం జర్నలిస్టులకి సమాధానం చెప్పే విధానం. అలానే ఆడియన్స్ తో మాట్లాడే విధానం ఇవన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సూర్య వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు నేను ప్రేమ (Nuvvu Nenu Prema) అనే సినిమాలో సూర్య తన ప్రేమను చుట్టి భూమికాకు విసురుతాడు. ఆ సీన్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే సీన్ ను తన ప్రేక్షకులతో రీ క్రియేట్ చేసి ప్రేమను విసిరాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక కంగువ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి సినిమా ఎంతటి ప్రభావాన్ని చూపించిందో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అంతటి ప్రభావాన్ని ఈ సినిమా చూపించబోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా దాదాపు 2000 కోట్లు వసూలు చేస్తుంది అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా కంగువ పార్ట్ 1 సినిమాకు పోటీగా మిగతా సినిమాలో రిలీజ్ అవ్వచ్చు కానీ కంగువా టు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఏ సినిమా కూడా పోటీలో దిగదు అని తన కాన్ఫిడెన్స్ కూడా తెలియజేశారు. మునుపెన్నడు ఇండియన్ స్క్రీన్ పైన చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇదేమైనా ఇప్పటివరకు వేయికోట్ల సినిమా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో రాలేదు. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుందో లేదో వేచి చూడాలి.

Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×