EPAPER

Pushpa2 : పుష్ప 2 బిజినెస్ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్.. కల్కి రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా..

Pushpa2 : పుష్ప 2 బిజినెస్ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్.. కల్కి రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా..

Pushpa2 : పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబో లో రాబోతున్న మూవీ పుష్ప 2.. ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. మాస్ యాక్షన్ సన్నీవేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం థియేటర్స్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ కోట్లల్లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ఈ సినిమా పై జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.


ఈ మూవీని అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే థియేటర్ల లోకి రిలీజ్ చెయ్యనున్నారని టాక్.. ఈ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూఎస్ లో డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్ షోలు వేయనున్నారట. అలాగే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు నార్త్ ఇండియా తో పాటు తెలుగు రాష్ట్రాలలో వేయబోతున్నారనే ఓ వార్తలు వినిపిస్తున్నాయి.. డిసెంబర్ 5 న అర్థరాత్రి మొదటి షోను వెయ్యబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ మూవీని 5 న రిలీజ్ చేస్తారా? లేదా 6 న రిలీజ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమా పైన ఉన్న అంచనాల నేపథ్యంలో మేకర్స్ ఒకరోజు ముందుగానే రిలీజ్ ప్లాన్ చేయడమే కాకుండా ప్రీమియర్ షోలు కూడా వేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు.. బన్నీ కూడా ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట. మొదటి రోజే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడమే కాదు రెండు వందల కోట్ల కు పై గ్రాస్ ను రాబడుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక టికెట్ ధరలు కూడా తెలుగు రాష్ట్రాలలో పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దాంతో కల్కి పేరు మీద ఉన్న ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని కూడా ‘పుష్ప 2’ బ్రేక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ‘దేవర’ మూవీనే మొదటి రోజు ఏకంగా 154 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. భారీ అంచనాలు మధ్య రాబోతున్న ‘పుష్ప 2’ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందనేది ప్రేక్షకులకే వదిలెయ్యాలి.. ఏది ఏమైనా ఈ మూవీ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వాటిని రీచ్ అయ్యేలా సుకుమార్ సినిమాను తెరకెక్కించాడో లేదో చూడాలి.. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడో అన్నది ఆసక్తిగా మారింది…


Related News

Matthu Vadalara 2: చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేసుకున్నారు

20 years of ShankarDadaMBBS: రీమేక్ తో రికార్డ్స్ క్రియేట్ చేసారు

Oviya: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

People Media Factory: ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ, లాభాలు రావట్లేదు

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Big Stories

×