Virupaksha: డైరెక్టర్ సుకుమార్. స్క్రీన్‌ప్లేతో ఆటాడుకునే లెక్కల మాస్టర్. డౌటుంటే.. 1-నేనొక్కడినే.. చూడండి. ట్విస్టులతో దిమ్మతిరిగి పోద్ది. అలాంటి సుకుమార్ ఇటీవలి విరూపక్షలో పెన్ను పెట్టాడు. కథకే హైలైట్ అయిన విలన్‌ని మార్చేశాడు. స్టోరీ మొత్తం మారిపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. హీరోయినే విలన్ అయ్యింది. కట్ చేస్తే.. 100 కోట్ల కలెక్షన్స్. సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్. అట్లుంటది సుకుమార్‌తోని.
ఈ ఆసక్తికర వివరాలన్నీ విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు చెప్పాడు. మొదట అతను రాసుకున్న కథలో హీరో సోదరి పార్వతి (యాంకర్ శ్యామల)ని విలన్‌గా చూపించాలని అనుకున్నాడట. గ్రామంలో జరిగే ఉపద్రవాలన్నిటికీ ఆమెనే కారణంగా చూపి విలన్‌ని చేశాడట. కథ పూర్తయ్యాక.. స్క్రీన్‌ప్లే కోసం స్క్రిప్ట్ సుకుమార్ దగ్గరికి చేరింది. మాస్టర్ మైండ్ ఎంట్రీతో విలన్ మారిపోయింది. స్టోరీ మళ్లీ మొదటికొచ్చింది.
“పార్వతి విలన్ అయితే అంత ఇంపాక్ట్ ఇవ్వదు.. క్లైమాక్స్ బ్లాస్ట్ అవ్వాలి.. హీరోయిన్‌ను విలన్‌గా మార్చు”.. అని కార్తీక్‌కు చెప్పారట సుకుమార్. ఆ ఐడియా బాగుందనుకొని.. మళ్లీ కథను కాస్త మార్చేశాడట. కొత్త సీన్లు రాసుకున్నారట. అవి మళ్లీ సుకుమార్‌కు చూపించడం.. ఆయన ఓకే చేయడంతో.. ఫైనల్‌గా ‘విరూపాక్ష’ వచ్చింది. క్లైమాక్సే ఈ సినిమాకు బలం. హీరోయినే విలన్ కావడం సంచలనం. ఆ క్రెడిట్ అంతా సుకుమార్‌దే అంటున్నారు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు. పోలా.. అదిరిపోలా…
Leave a Comment