EPAPER

69th National Film Awards : గురుశిష్యులు తగ్గేదేలే.. అవార్డుల ఉప్పెన.. జనరేషన్ మారింది బ్రో..

69th National Film Awards : గురుశిష్యులు తగ్గేదేలే.. అవార్డుల ఉప్పెన.. జనరేషన్ మారింది బ్రో..
National Film Awards winners telugu

National Film Awards winners telugu(Latest news in tollywood) :

జాతీయ అవార్డుల్లో పుష్ఫ చరిత్ర సృష్టించింది. పుష్ఫ హీరో అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ అవార్డు లభించింది. తెలుగు నుంచి ఈ అవార్డు సాధించిన తొలి నటుడు బన్నీనే కావడం గ్రేట్. ఇక, పుష్పలో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వరించింది. ఇలా పుష్ప.. జాతీయ అవార్డుల్లో తగ్గేదేలే అనిపించింది. పరోక్షంగా ఈ అవార్డులు సుకుమార్‌కూ వచ్చినట్టే.


పుష్ప నుంచి బన్నీకి, దేవీకి ఈ అవార్డులు వచ్చినా.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కానీ, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు కానీ రాలేదు. రాకెట్రీ, RRRలు ఆ అవార్డులను దక్కించుకున్నాయి. ఆ లోటు మాత్రం కొంచెం ఉందనే చెప్పాలి. అయితే, బెస్ట్ మూవీ అవార్డు రాలేదనే బాధను.. ఉప్పెన.. ఉఫ్ మని ఎగిరగొట్టేసింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును కొల్లగొట్టింది.

హీరో వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబులకు ఉప్పెన ఫస్ట్ మూవీ. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు సాధించి శెభాష్ అనిపించుకున్నారు. సినిమాకు ఉత్తమ అవార్డు వచ్చిందంటే.. ఆ క్రెడిట్ మాగ్జిమమ్ డైరెక్టర్‌కే దక్కుతుంది. అలా.. ఉప్పెన‌కు జాతీయ అవార్డు వచ్చిదంటే.. దర్శకుడు బుచ్చిబాబుకు వచ్చినట్టే.


బుచ్చిబాబు.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే. ఇలా గురుశిష్యులు ఒకేసారి జాతీయ అవార్డులు తీసుకురావడం ఆసక్తికరమే. జనరేషన్ మారింది బ్రో.

Related News

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Big Stories

×