EPAPER

Sriranga Neethulu Review: ‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ.. మూడు కథలు.. ముగ్గురు జీవితాలు.. హిట్టా..? ఫట్టా..?

Sriranga Neethulu Review: ‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ.. మూడు కథలు.. ముగ్గురు జీవితాలు.. హిట్టా..? ఫట్టా..?

Sriranga Neethulu Movie Review:


సినిమా: శ్రీరంగనీతులు

నటీనటులు: సుహాస్‌, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌, కార్తీక్‌రత్నం


దర్శకత్వం: ప్రవీణ్‌కుమార్‌

నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి

రిలీజ్: ఏప్రిల్‌ 11

సుహాస్‌, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌, కార్తీక్‌రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు అంటే ఏప్రిల్ 11 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

ఈ సినిమాలో ఒకేసారి మూడు కథలు కొనసాగుతూ ఉంటాయి. ఫస్ట్ కథలో శివ(సుహాస్) ఓ చిన్న బస్తీలో సామ్ సంగ్‌ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తుంటాడు. అయితే ఆ బస్తీలో ఉండే యూత్‌లో అందరికంటే తానే గొప్పగ ఉండాలిని అనుకుంటాడు. ఈ కారణంతోనే ఆ ఏరియాలో ఉండే ఓ రాజకీయ నాయకుడితో ఫొటోలు దిగి బ్యానర్లు కట్టించి వాటిని బతుకమ్మ గ్రౌండ్‌లో పెడతాడు. అయితే ఆ ఫ్లెక్సీ తెల్లవారే సరికి అక్కడ కనిపించదు. దాన్ని వేరే గ్యాంగ్ చించేస్తారు. దీంతో ఈ విషయం తెలిసి శివ వాళ్లతో లొల్లి పెట్టుకుంటాడు.

రెండో కథ.. ఈ రెండో కథలో ఇందు(రుహాణి శర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్) లవ్ బర్డ్స్. అయితే తమ ప్రేమ గురించి ఇందు తన ఇంట్లో చెప్పడానికి చాలా భయపడుతుంది. అదే సమయంలో ఆమెకు తన తల్లిదండ్రులు వేరొకరితో సంబంధం చూస్తారు. అంతలోనే ఇందుకు తాను ప్రెగ్నెంట్ అయ్యాననే డౌట్ వస్తుంది. దీంతో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక.. అటు వరుణ్‌తో లేచిపోయి పెళ్లి చేసుకోలేక వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

Also Read: Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. వీడియో వైరల్

మూడో కథ..కార్తీక్ (కార్తీక్ రత్నం) జీవితంలో సక్సెస్ కాలేక మందుకు బానిసైపోతాడు. మందు, సిగరెట్, గంజాయికి బాగా అలవాటు పడి ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుకుంటాడు. కార్తీక్ తండ్రి అతడిని మార్చడానికి ఎంతగానో ట్రై చేస్తాడు. కానీ అతడు మారడు. అయితే ఓ రోజు అతడి తమ్ముడు ఇంట్లో ఉన్న గంజాయి మొక్కలతో సెల్ఫీ తీసుకుంటాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు అది చూసి వాళ్ల ఇంటికి వెళ్తారు. దీంతో కార్తిక్ పారిపోతాడు. పోలీసులు అతడి కోసం వెతుకుతుంటారు.

ఇలా ఈ సినిమా మూడు కథలతో తెరకెక్కింది. అయితే చివరికి శివ మళ్లీ ఫ్లెక్సీలు కొట్టించాడా?.. వేరే గ్యాంగ్‌తో గొడవలు పడుతున్నాడా?. అలాగే ఇందు , వరుణ్ ఒక్కటయ్యారా?.. వాళ్ల ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించుకున్నారా? లేదా. అలాగే కార్తీక్ చివరికి పోలీసులకు చిక్కాడా?.. తన అలవాటును మార్చుకున్నాడా? అనేది థియేటర్లలో చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ మూడు కథలకు ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా స్క్రీన్ ప్లే బాగా చేశారు. సినిమాలో కామెడీ పర్వాలేదనిపించారు. కొన్ని చోట్ల బాగా నవ్వించేశారు. అయితే క్లైమాక్స్‌లో ఎమోషన్‌ని వర్కౌట్ చేయాలని చూశారు కానీ.. ఏవో రెండు మూడు డైలాగ్‌లు చెప్పి మమ అనిపించేశారు. ఇంకొంచెం బాగా రాసుంటే బాగుండేది అనిపించింది.

Also Read: Kartikeya – Bhaje Vaayu Vegam: బ్యాట్‌తో కార్తికేయ పరుగులు.. కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రివీల్

కాగా ఇందులో కార్తీక్ ఎందుకు అలా వ్యసనాలకు బానిసయ్యాడు అనేది ఇంకొంచెం బెటర్‌గా చూపిస్తే బాగుండేది. మొత్తానికి ఒక మనిషి వేరే వాళ్లతో పోల్చుకుని తనను తాను గొప్పలకు పోతాడని.. ఎప్పుడూ కూడా ఉన్నదాంతో ఇష్టపడడని.. అయితే జీవితంలో మనకి నచ్చినవి కావాలంటే దైర్యంతో ముందుకు సాగాలని.. ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అనుకున్న టార్గెట్‌ని వదిలేయకుండా ప్రయత్నించాలని ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

ఈ మూవీలో సుహాస్ ఓ బస్తీ కుర్రాడిగా నటించి అదరగొట్టాడు. అలాగే విరాజ్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. రుహాణి శర్మ కూడా ఇంట్లో భయపడే అమ్మాయిలా తమ ప్రేమను ఎలా చెప్పాలో తెలియని పాత్రలో ఒదిగిపోయింది. అంతేకాకుండా కార్తీక్ రత్నం కూడా వ్యసనాలకు బానిసైన ఓ యువకుడిలా బాగా సెట్ అయ్యాడు.

మిగతా నటీనటులు తమ నటనతో అదరగొట్టేశారు. అలాగే మూవీలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్‌ కూడా ఓకే అనిపించాయి. కామెడీ ట్రాక్, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ వ్యాల్యూస్ కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి శ్రీరంగనీతులు మూవీ అందరూ చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.

Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×