EPAPER

Gorre Puranam Trailer: గొర్రె పురాణం.. మళ్లీ కొత్త కథతో వస్తున్న సుహాస్

Gorre Puranam Trailer: గొర్రె పురాణం.. మళ్లీ కొత్త కథతో వస్తున్న సుహాస్

Gorre Puranam Trailer: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ మేడ్  స్టార్స్ గా ఎదుగుతున్న హీరోల్లో సుహాస్ కూడా చేరాడు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను ప్రారంభించి  కలర్ ఫోటో అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ జనరేషన్ లో కథ ముఖ్యం కానీ, కలర్ ముఖ్యం కాదు చెప్పిన హీరో సుహాస్. మంచి మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్ నటిస్తున్న తాజా చిత్రాల్లో గొర్రె పురాణం ఒకటి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన విషిక నటిస్తోంది.  ఇప్పటికే  ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్  రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి.. సుహాస్ మరో కొత్త కథతో ప్రేక్షకులను మెప్పించడానికి  రెడీ అయినట్లు  తెలుస్తోంది.

Siddharth: సమంతతో సహా సిద్దార్థ్ ఎఫైర్స్.. అదితి ఎన్నో భార్యనో తెలుసా.. ?


జంతువులను మనుషులు చంపొచ్చు. కానీ , జంతువులు వాటి ఆత్మరక్షణ కోసం మనుషులను చంపితే అది  నేరం.  ఇదే డైలాగ్ ను సుహాస్ కోర్టు లో  అడుగుతాడు.   ఇదే కథలా కనిపిస్తుంది. ఒక గొర్రె చుట్టూ ఈ కథ నడుస్తుంది. అనుకోకుండా ఒక గొర్రె.. జాతర జరుగుతున్న  వద్దకు వెళ్లి కల్లు తాగి పారిపోతుంది.  కల్లు తాగింది అంటే.. అమ్మవారి అనుగ్రహం ఆ గొర్రె మీద ఉంది. దాన్ని బలి ఇవ్వాలని హిందువులు. లేదు ఆ గొర్రెను మేము కొన్నాం.. మేము నరికేయాలి  అని ముస్లింలు గొడవ పడుతుంటారు.  ఇలా రెండు వర్గాల మధ్య గొడవపెట్టినందుకు  గొర్రె మీద కేసు వేసి జైలుకు పంపిస్తారు.

ఇక ఈ గొర్రెను తీసుకెళ్లి.. జైల్లో ఖైదీగా ఉంటున్న సుహాస్ రూమ్ లో వేస్తారు. ఎలాగైనా ఆ గొర్రెను కాపాడడానికి  సుహాస్ కంకణం కట్టుకుంటాడు. అసలు ఈ గొర్రె కథ ఏంటి.. ? గొర్రె మీద కేసు ఏంటి.. ?  సుహాస్ ఎందుకు జైలుకు వెళ్ళాడు.. ? అనేది సినిమా  చూసి తెలుసుకోవాల్సిందే. సుహాస్.. కథ బావుంటే  తప్ప హీరోగా చేయడానికి ఒప్పుకోడు. ఒక గొర్రెను ప్రధానంగా చేసుకొని కథ మొత్తం నడిపించడం అంటే మాములు విషయం కాదు.

Sreeleela: లంగా ఓణీలో చక్కని చుక్కలా మెరిసిపోతున్న శ్రీలీల..

గొర్రె పురాణంలో అసలు కథ వేరే  ఉందని  తెలుస్తోంది. కులాలు, మతాలు అనేది ట్రైలర్  లో చూపించినా సినిమాలో ఇంకేదో దాచినట్లు తెలుస్తుంది.  సుహాస్.. గొర్రెను  ప్రేమగా చూసుకోవం, ఒక చిన్న పిల్ల.. ఆగొర్రెను పెంచుకోవడం లాంటివి చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న సినిమాగా తెరకెక్కినా.. ట్రైలర్ తరువాత సుహాస్ హైప్ తీసుకొచ్చాడు.  ఇక ఇది కాకుండా సుహాస్ నటిస్తున్న మరో చిత్రం జనక అయితే గనుక.. ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలతో  సుహాస్ హిట్ అందుకుంటాడా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Adithi Rao – Siddarth : అప్పుడే భర్తకు చుక్కలు చూపిస్తున్న అదితి.. కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..

Big Stories

×