EPAPER
Kirrak Couples Episode 1

Hema Committee Report: హేమ కమిటీ రిపోర్ట్‌పై సినిమా.. రంగంలోకి దిగనున్న కాంట్రవర్షియల్ డైరెక్టర్

Hema Committee Report: హేమ కమిటీ రిపోర్ట్‌పై సినిమా.. రంగంలోకి దిగనున్న కాంట్రవర్షియల్ డైరెక్టర్

Hema Committee Report: రియల్ లైఫ్‌లో జరిగే కాంట్రవర్సీలను సినిమాలుగా తెరకెక్కించడం అంత ఈజీ కాదు. ఒకవేళ అలా తెరకెక్కించినా కూడా దానిని విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం పెద్ద యుద్ధమే చేయాలి. అలాంటి ఒక కాంట్రవర్షియల్ సినిమాను తెరకెక్కించి హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు సుదీప్తో సేన్. ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాతో దర్శకుడు సుదీప్తో సేన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పుడు ఇదే సినిమా తరహాలో మరో కాంట్రవర్షియల్ కథతో సిద్ధమయ్యాడు ఈ డైరెక్టర్. అదే హేమ కమిటీ రిపోర్ట్. ప్రస్తుతం మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన హేమ కమిటీ రిపోర్ట్‌పై సుదీప్తో మూవీ తెరకెక్కించాలని అనుకుంటున్నాడని వార్త బయటికొచ్చింది.


మళ్లీ తనే హీరోయిన్‌గా

సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఇదొక సంచలనం. అందుకే దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ షా కలిసి మరొక ఫీమేల్ ఓరియెంటెడ్ కాంట్రవర్షియల్ మూవీ సిద్ధమవుతుందని సమాచారం. దీనిని ‘ది కేరళ స్టోరీ’కి ఫ్రాంచైజ్‌గా తెరకెక్కించాలని, ఇందులో కూడా ఆదా శర్మనే హీరోయిన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ హేమ కమిటీ రిపోర్ట్‌పై సినిమా తెరకెక్కించే సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవల మాలీవుడ్‌లో బయటికొచ్చిన హేమ కమిటీ రిపోర్ట్.. పలు రాజకీయ చర్చలకు కూడా దారితీసింది. మలయాళ పరిశ్రమలో పలువురు స్టార్ సెలబ్రిటీల పేర్లు ఇందులో బయటికొచ్చాయి.


Also Read: నటిపై లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. పరారిలో నటుడు సిద్ధిఖీ

ప్రభుత్వంతోనే డీల్

ప్రస్తుతం ఈ హేమ కమిటీ రిపోర్ట్ మొత్తం కేరళ ప్రభుత్వం చేతిలో ఉంది. దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఒక సినిమా తెరకెక్కించడానికి ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే నేరుగా కేరళకు వచ్చిన రిపోర్ట్‌ను తమ చేతిలోకి తెచ్చుకోవడం కోసం కృష్టిచేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట. ఈ విషయంలో నేషనల్ కమీషన్ ఆఫ్ ఉమెన్ కూడా మలయాళ పరిశ్రమకే సపోర్ట్‌గా ఉంది. వారం రోజుల లోపు రిపోర్ట్‌ను తమకు అందించమని మేకర్స్ కోరినా ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ ఈ విషయంపై స్పందించలేదని సమాచారం. ముఖ్యంగా నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ సభ్యురాలు అయిన దెలినా ఖోంగ్దూప్.. మేకర్స్ తరపున కేరళ ప్రభుత్వంతో మాట్లాడడానికి సిద్ధమయ్యారు.

పలు అరెస్టులు కూడా

ఇప్పటికే మాలీవుడ్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కున్నవారు హేమ కమిటీ కమీషన్ దగ్గరకు వచ్చి తమ స్టేట్‌మెంట్స్ అందిస్తున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలపై పలు కీలక విషయాలు హేమ కమిటీ రిపోర్ట్‌లో ఉన్నాయని నేషన్ కమీషన్ ఫర్ ఉమెన్ సైతం ఒప్పుకుంది. రోజులు గడుస్తున్నకొద్దీ మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్ వల్ల మరెన్నో పెద్దల పేర్లు బయటికొస్తాయని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు. మలయాళం, తమిళంలో సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిద్ధికీ పేరు కూడా ఈ హేమ కమిటీ రిపోర్ట్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్నారు. అంతే కాకుండా మాలీవుడ్‌లో దీని వల్ల పలు అరెస్టులు కూడా జరిగాయి.

Related News

Suriya: పవన్ కు కార్తీ క్షమాపణ.. ఎట్టకేలకు స్పందించిన సూర్య

Harsha Sai: బిగ్ బాస్ బ్యూటీపై హర్షసాయి అత్యాచారం.. వాడుకొని వదిలేశాడు

Pawan Kalyan: కార్తీ క్షమాపణపై పవన్ కళ్యాణ్ స్పందన.. సూర్య, జ్యోతికలను ఉద్దేశిస్తూ ఏమన్నారంటే?

Sreeleela : ఓర్నీ ఇది డ్యాన్సా.. శ్రీలీల డ్యాన్స్ పై సెటైర్స్..

Harsha Sai:పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై యువతీ ఫిర్యాదు

Pawan Kalyan: పవన్ తప్పు చేశావ్.. నిన్ను వదలేది లేదు అంటున్న తమిళ తంబీలు.. ?

Big Stories

×