EPAPER

Stree 2 movie Review: స్త్రీ..2 భయపెట్టిందా? భయపడిందా?.. రివ్యూ

Stree 2 movie Review: స్త్రీ..2 భయపెట్టిందా? భయపడిందా?.. రివ్యూ

Stree 2 movie Review In Telugu..Sraddha kapoor.. Rajkumar Rao: 2018 లో శ్రద్ధాకపూర్ ముఖ్యపాత్ర పోషించిన స్త్రీ మూవీ ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఆరేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ మూవీ స్త్రీ-2. హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి స్టార్ డమ్ లేకుండానే రూపొందించిన ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ సైతం బడా హీరోలను తలదన్నేలా టిక్కెట్లు బుక్ అయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ మూవీ విడుదలకు ముందే రూ.20 కోట్లు రాబట్టిందంటే ఈ మూవీపై అంచనాలు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేక భయపెట్టిందో చూద్దాం..


బెస్ట్ స్క్రీన్ ప్లే

చందేరి అనే ఊరిలో తలలేకుండా మెండెంగా తిరుగుతున్న ఓ దెయ్యం ఆ ప్రాంతంలో మహిళలను ఎత్తుకుపోతుంటుంది. ఆ దెయ్యాన్ని పట్టుకునే ప్రయత్నంలో హీరో, అతని ఫ్రెండ్స్ చేసే విన్యాసాలు, వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే స్త్రీ 2 మూవీ కథాంశం. ఉండటానికి సింపుల్ కథే అయినా రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను సీట్లకు కట్టేసి కూర్చోపెట్టడం అనేది మాటలు కాదు. ఇలాంటి మూవీస్ కు హారర్ తో పాటు కామెడీ కూడా జోడించి చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. కేవలం ఇది స్క్రీన్ ప్లే మూవీ. ఈ సినిమాకు ఇదే హీరో. హారర్ సీన్స్ ఆడియన్స్ కు అద్భుత ఫీల్ కలిగిస్తాయి. కామెడీ సన్నివేశాలు బాగా అలరిస్తాయి.


సత్తా చాటిన దర్శకుడు

ఈ మూవీలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ జోడీగా నటించారు. వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ స్పెషల్ కేమియో రూల్స్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఫన్ రైడర్ గా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం పకడ్బందీగా రూపొందించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చక్కగా వర్కవుట్ అయింది. దర్శకుడు అమర్ కౌషిక్ మరోసారి తన సత్తా చాటాడు. మొదటి పార్ట్ స్త్రీ మూవీలో ఆడ దెయ్యం మగవారిని ఎత్తుకుపోయేది. ఇందులో మాత్రం మగ దెయ్యం ఆడవారిని తీసుకెళ్లడం చూపిస్తారు. స్టోరీ సింపుల్ పాయింటే ..కానీ కామెడీ, హారర్ విషయంలో ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సినిమా స్టార్టింగ్ టూ ఎండ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తునే ఉంటారు. తల లేని మొండెం కోటలోకి హీరో బృందం వెళ్లాక వచ్చే సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇక సాంకేతికంగా కూడా ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఖర్చుపెట్టారు. వారి తపన అంతా ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది.

తమన్నా సాంగ్ హైలెట్

బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ ఈ సినిమాకు లైఫ్ ని ఇచ్చిందని చెప్పవచ్చు. కెమెరా డిపార్ట్ మెంట్ కూడా ఓ కమిట్ మెంట్ తో పనిచేశారు. డైలాగులు కూడా బాగున్నాయి. మొత్తానికి అంతా కలిసి టీమ్ వర్క్ చేస్తే ఎలాంటి ఔట్ పుట్ వస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. శ్రద్ధాకపూర్ గ్లామర్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. ఇక ఈ మూవీలో తమన్నా భాటియా ఓ ఐటం సాంగ్ చేసింది. విడుదలకు ముందే ఆ పాట సూపర్ హిట్ అయింది. తొలి రెండు భాగాలు గా వచ్చిన స్త్రీ భవిష్యత్ లో మరిన్ని పార్టులుగా రిలీజ్ కానున్నదని హింట్ కూడా ఇచ్చేశారు. మొత్తానికి ఈ స్త్రీ భయపెడుతూనే నవ్వించింది.

 

 

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×