EPAPER
Kirrak Couples Episode 1

SSMB29 : మహేష్ బాబు మామూలుగా లేడు, లుక్కు చూస్తే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి

SSMB29 : మహేష్ బాబు మామూలుగా లేడు, లుక్కు చూస్తే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి

SSMB29 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ చేస్తే అవి కూడా కోట్లలో వసూలు చేస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఏవిధంగా బ్రహ్మరథం పడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మహేష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఆ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది.


ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్

మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ మాన్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ లో చెప్తాడు. మిల్క్ బాయ్ లా ఉన్నాడు ఈయన భాయ్ ఏంటి అని. ఇకపోతే మహేష్ బాబు తన కెరియర్లో మొదటిసారి ఎస్ఎస్ రాజమౌళితో పనిచేస్తున్నారు. మహేష్ కెరియర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. ఈ సినిమా పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పడుతుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి స్థాయి పూర్తిగా మారిపోయింది. రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.


మహేష్ బాబు లుక్ రీవీల్

రాజమౌళితో ఒక హీరో పని చేస్తున్నాడు అంటే కొన్ని రోజులు బయట కనిపించకుండా వర్కౌట్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ పలుసార్లు ఎయిర్పోర్ట్స్ లో దర్శనం ఇచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా హెయిర్ పెంచారు. కేవలం హెయిర్ మాత్రమే కాకుండా మహేష్ బాబు తన కెరీర్లో మొదటిసారి గడ్డాన్ని కూడా పెంచారు. అయితే కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. ఇక రీసెంట్ గా మహేష్ బాబు వరద బాధితుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఆ చెక్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా కలిసి ఇచ్చారు మహేష్ బాబు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

SSMB29

ఏం ప్లాన్ చేసారో

ఈ ఫోటోలో మహేష్ బాబును చూస్తే సినిమా మీద అంచనాలు మరింత రెట్టింపు అవుతాయి అని చెప్పాలి. లాంగ్ హెయిర్ తో గుబురు గడ్డంతో ఒక హాలీవుడ్ హీరోను తలపించే రేంజ్ లో ఉన్నాడు మహేష్. దీంతో చాలామంది అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేసాడో అంటూ చర్చించడం మొదలుపెట్టారు. సినిమా గురించి సరైన అప్డేట్స్ లేకపోయినా కూడా మహేష్ ను ఇలా చూడటం, ఆయన అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పాలి. మహేష్ తో పాటు నమ్రత కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. మొత్తానికి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వకుండానే బాబులు రీవీల్ అవడంతో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయిపోయాయి.

Related News

Viswam : గోపీచంద్ ఫ్యాన్స్ కు షాక్… విశ్వం స్టోరీ లీక్, హీరో రోల్ ఇదే?

Oscar 2025 : అఫిషియల్ గా ఆస్కార్ బరిలోకి అడుగు పెట్టిన “లాపతా లేడిస్”

Rajinikanth Coolie: తెలుగులో భారీ బిజినెస్.. థియేట్రికల్ రైట్స్ వారి సొంతం..!

Jani Master Issue : జానీ మాస్టర్ ఇష్యూ.. అల్లు అర్జున్ స్పందనపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్

Viswam : గోపీచంద్ కు 6 కోట్లా… మార్కెట్‌కి మించి రిస్క్ చేస్తున్నారా?

Kalki 2898AD: మళ్లీ వివాదంలో చిక్కుకున్న కల్కి.. గరికపాటి చురకలు..!

Big Stories

×