BigTV English

SSMB 28 : మ‌హేష్ కోసం మూడు టైటిల్స్‌!

SSMB 28 : మ‌హేష్ కోసం మూడు టైటిల్స్‌!
SSMB 28

SSMB 28 : సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇంతకు ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత‌డు, ఖ‌లేజా చిత్రాలు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేదు. దీంతో ఈసారి మాట‌ల మాంత్రికుడు ఎలాగైనా మ‌హేష్‌తో మాస్ హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతో సినిమాను రూపొందిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టు మ‌హేష్ సైతం ఎన్న‌డూ లేని విధంగా సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కానీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే మాత్రం సూప‌ర్ స్టార్ సిక్స్ ప్యాక్ లుక్‌తో సంద‌డి చేస్తార‌నే అనిపిస్తోంది.


ఇక చిత్రీక‌ర‌ణ విష‌యానికి వ‌స్తే..ఇప్ప‌టికే కొంత మేర‌కు షూటింగ్ కూడా పూర్త‌య్యింది. అయితే ఇప్పుడు మ‌న బాబు కుటుంబంతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. ప‌నిలో ప‌నిగా స్పెయిన్‌లో స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఈ నెల 31న మ‌హేష్ తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్, గ్లింప్స్‌ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌హేష్ 28 కోసం మూడు టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అందులో గుంటూరు కారం, అమ‌రావ‌తికి అటు ఇటుగా.. అనే టైటిల్స్ నెట్టింట వైర‌ల్ అయిన‌వే. అయితే తాజాగా మ‌రో టైటిల్ కూడా లిస్టులో చేరింది.. అదే ఊరికి మొన‌గాడు.

ఊరికి మొన‌గాడు అనేది కృష్ణ హీరోగా న‌టించిన చిత్రం. తండ్రి ప్ర‌థ‌మ జ‌యంతి సంద‌ర్భంగా మ‌హేష్ ఆయ‌న సినిమా పేరునే తన సినిమాకు పెట్టుకుని ట్రిబ్యూట్ ఇస్తారో లేక మాస్ టైటిల్ కావాల‌ని గుంటూరు కారం వైపు మొగ్గుచూపుతారో.. క్లాస్ టైటిల్ కోసం అమ‌రావ‌తికి అటు ఇటుగా..అని ఫిక్స్ అవుతారో చూడాలి మ‌రి. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×