Spirit & SSMB29: రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించాయి. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తెరకెక్కించిన తర్వాత తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసి వచ్చింది. ఒక సినిమాను ఆ స్థాయిలో ఊహించడమే చాలా కష్టం. కానీ అప్పట్లోనే రాజమౌళి ఊహించి తెలుగు సినిమా స్థాయిని శిఖరం మీద నిల్చో పెట్టాడు. అలానే బాహుబలి సినిమాకి సంబంధించి ప్రభాస్ ఇచ్చిన కమిట్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక సినిమా కోసం ఏ స్టార్ హీరో కూడా అంత టైం కేటాయించరు. అప్పటికే చత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలు ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ లో నిల్చొబెట్టాయి. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.
బాహుబలి సినిమాకి మొదట తెలుగులో మిశ్రమ స్పందన లభించిన కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చింది. ఇక బాహుబలి టు ఇప్పటికే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. వస్తున్న చాలా సినిమాలకి వస్తున్న కలెక్షన్స్‌ను నాన్ బాహుబలి అనే పేరుతో అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే బాహుబలి సినిమా ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంది అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా మామూలు ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ ను హీరోలుగా పెట్టి ఎస్.ఎస్ రాజమౌళి ఒక అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించాడు. చాలామంది ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే చాలామందికి క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ లో పెరిగిపోయింది. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమాను చేస్తున్నారు. మహేష్ బాబు కెరియర్ లో చేస్తున్న 29వ సినిమా ఇది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
అలానే అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. అప్పట్లో శివ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మొదటి సినిమాతోనే అదే స్థాయిలో ఇంపాక్ట్‌ని క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం సందీప్ చేయబోయే స్పిరిట్ సినిమా, అలానే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే ఈ రెండు సినిమాలు 2025 జనవరిలో లాంచ్ కానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే షూటింగ్ కూడా అదే నెలలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా సౌత్ ఇండస్ట్రీలోని ఈ రెండు సినిమాలు కోసం ఆడియన్స్ చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక 2025లో ఈ సినిమాలు స్టార్ట్ అయినా కూడా ఒక సినిమా మాత్రం రావడానికి దాదాపు మూడేళ్ల పాటు టైం పడుతుందని అందరు ఫిక్స్ అయి ఉండిపోయారు. ఇక సందీప్ రెడ్డివంగా స్పిరిట్ సినిమాను ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.