EPAPER
Kirrak Couples Episode 1

Film Festival : ఆహా.. భావి సినీ భవితకు వేదికగా ఫిల్మ్ ఫెస్ట్..

Film Festival  : ఆహా..  భావి సినీ భవితకు వేదికగా ఫిల్మ్ ఫెస్ట్..
Film Festival of India

Film Festival : ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సంస్ధ ఆహా.. టాలీవుడ్ నిర్మాణ దిగ్గజం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ ను ఆవిష్కరించింది. ఈ ఫెస్టివల్ లో భాగంగా సరికొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో వీరు ముందుకు వచ్చారు. ఈ గ్రాండ్ ఫెస్ట్ లో సినిమాలను ప్రదర్శించడంతో పాటుగా గ్రూప్ డిస్కషన్స్, షార్ట్ ఫిలిమ్స్ పై కాంటెస్ట్, పానెల్ డిస్కషన్ కూడా జరుగుతాయి.


టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ కి కొదవ ఏమీ లేదు. చాలామంది ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అని తపించే యంగ్ డైరెక్టర్స్ ..స్టోరీ రైటర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఔత్సాహికులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీ దగ్గర మంచి కథ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా టాలెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా మీకు ఈ వేదిక తొలిమెట్టుగా మారే ఆస్కారం ఉంది.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మొత్తం మూడు విభాగాలలో మీ టాలెంట్ ప్రదర్శించే ఆస్కారం ఉంది. మొదట విభాగం షార్ట్ ఫిల్మ్.. మంచి కథ ,వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఏదైనా షార్ట్ ఫిలిం ..3 నుంచి 15 నిమిషాల నిడివి ఉన్న వీడియో రూపంలో పంపాలి. ఇక రెండో విభాగం షార్ట్స్ షార్ట్.. ఇందులో పాల్గొనాలి అనుకునే వారు మూడు నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న షార్ట్స్ షార్ట్ను పంపాల్సి ఉంటుంది. మూడవ విభాగం కోసం ఐదు నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న మ్యూజిక్ వీడియోని పంపాల్సి ఉంటుంది. 


అయితే ఇవి అన్ని జనవరి 1,2020 నుంచి డిసెంబర్ 10 , 2023 మధ్యలో వచ్చిన మూవీ కంటెంట్ తో చిత్రీకరించాల్సి ఉంటుంది.ప్రస్తుతానికి ఈ ఫిలిం ఫెస్టివల్ డిసెంబర్ 20వ తారీకు తెలుగులో నిర్వహించనున్నారు. ఫ్యూచర్ లో ఇది తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ నిర్వహించుతారు. ఇక ఈ ఫిలిం ఫెస్ట్ కు జ్యూరీ మెంబర్స్ గా టాలీవుడ్ స్టార్ మేకర్స్ వ్యవహరించనున్నారు. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జీవితా రాజశేఖర్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, వి.ఎన్.ఆదిత్య, చందు మొండేటి తో పాటు దర్శకుడు సాయి రాజేష్, ఇండియన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్గా తన సేవలు అందించిన అనీల్ వాన్వరి ఈ ఫెస్ట్ కి జ్యూరీ మెంబర్స్ గా ఉన్నారు. 

ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ కు చెందిన సెలబ్రిటీలు పాల్గొననున్నారు.ఈ కార్యక్రమం సినీ ఇండస్ట్రీ భవిష్యత్తును ముందుకు నడిపించే వేదిక గా మారనుంది అని అందరూ భావిస్తున్నారు. ఫస్ట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో విడుదల చేస్తారు.

Related News

Sathya Dev: సైడ్ అయ్యాడా? లేక వదిలేశారా..?

Jagapathi Babu: నీకు నాకు కొవ్వు ఎక్కువ.. మంచు వారసురాలిని పట్టుకొని అంత మాట అనేశాడు ఏంటి.. ?

Puri Jagannadh: ఇంటికొచ్చిన ఫ్యాన్స్ తో ముంబాయి నుంచి వీడియో కాల్ మాట్లాడిన పూరి జగన్నాథ్

Game Changer: బాబోయ్ రామ్ చరణ్ శంకర్ సాంగ్ ఇలా ఉంది ఏంటి ?

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Balakrishna: అందరికీ లిమిట్స్ ఉంటాయి.. ఐఫా వేడుకల్లో మీడియాపై బాలకృష్ణ ఫైర్

Ajith : సినిమాలకు అజిత్ గుడ్ బై..? ఆ ఒక్కటే కారణమా?

Big Stories

×