EPAPER

Sonusood: కష్టాల్లో ఉన్న యువకుడికి సోనూసూద్ భరోసా.. తండ్రి గుండె ఆపరేషన్ కోసం?

Sonusood: కష్టాల్లో ఉన్న యువకుడికి సోనూసూద్ భరోసా.. తండ్రి గుండె ఆపరేషన్ కోసం?

Sonusood: సినిమాల్లో విలనైతే.. రియల్ లైఫ్ లోనూ వాళ్లు అలానే ఉంటారని అనుకుంటుంటాం. కానీ.. రియల్ లైఫ్ హీరోలు విలన్లవ్వొచ్చు.. విలన్లు హీరోలవ్వొచ్చు. సోనూసూద్ లో ఉన్న రియల్ హీరోని మనకు కోవిడ్ పరిచయం చేసింది. కోవిడ్ లాక్ డౌన్ లో, ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకూ సోనూసూద్ ఎంతోమందికి సహాయం చేశాడు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోమని అడగడమే ఆలస్యం.. నేనున్నానంటూ భరోసా ఇస్తాడు. తాజాగా ఓ యువకుడికి కూడా సోనూసూద్ అండగా నిలిచాడు.


తనతండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, గుండె 20 శాతం మాత్రమే పనిచేస్తుందని.. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని తల్లిడిల్లిపోయాడు. ఆ పోస్టుపై స్పందించిన సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడీ న్యూస్ వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని డియోరియాకు చెందిన పల్లవ్ సింగ్ అనే యువకుడు తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఎక్స్ వేదికగా వివరించి సహాయం కోరాడు. సెప్టెంబర్ 15న పల్లవ్ సింగ్ తండ్రికి గుండెపోటు రాగా.. డియోరియాకు దగ్గర్లోని గోరఖ్ పూర్ లో ఉన్న ఆసుపత్రిలో చూపించాడు. 3 ధమనుల్లోనూ బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. అతని గుండె 20 శాతం మాత్రమే పనిచేస్తోందని వైద్యులు చెప్పగా.. ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకొచ్చాడు. అక్కడ అన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. గుండె బలహీనంగా ఉందని, మందులు వాడాలని రాసిచ్చారు. శస్త్రచికిత్స చేయాలంటే 13 నెలలు ఆగాలని, అదికూడా 13 నెలలు వేచి ఉండాలని స్పష్టం చేశారు.


మరోవైపు తల్లి న్యూరోలాజికల్ డిజార్డర్ తో బాధపడుతోంది. ఉద్యోగం తప్ప మరో ఆధారం, ఆదాయం లేదు. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించే స్తోమత లేదు. ఈ వివరాలన్నింటినీ పల్లవ్ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేయగా.. నటుడు సోనూసూద్ దానిపై స్పందించారు. మీ తండ్రిని మేము చనిపోనివ్వము సోదరా..నా వ్యక్తిగత ట్విట్టర్ ఐడీ ఇన్ బాక్స్ కు నీ నంబర్ మెసేజ్ చేయండి. దయచేసి ట్విట్ లో పోస్ట్ చేయద్దని ఆ పోస్టుకు కామెంట్ చేశారు.

డా. ప్రశాంత్ మిశ్రా కూడా పల్లవ్ సింగ్ పోస్టుపై స్పందించారు. దయచేసి ముంబయి రండి.. వీలైనంత త్వరగా సియోన్ ఆసుపత్రిలో చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. అతని పోస్ట్ వైరలవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్.. ఒక హెల్ప్ లైన్ నంబర్ ను మెసేజ్ చేసింది. ఎయిమ్స్ హెల్ప్ లైన్ ద్వారా అతనికి సహాయం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు.

Related News

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×