EPAPER

SJ Suryah: నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు.. కానీ, ఎందుకు అయ్యాను అంటే.. ?

SJ Suryah: నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు.. కానీ, ఎందుకు అయ్యాను అంటే.. ?

SJ Suryah: ఎస్‌జె సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి మాట్లాడాలంటే మొదట డైరెక్టర్ అనే చెప్పాలి. తెలుగులో ఖుషీ లాంటి సినిమాతో పవన్ కళ్యాణ్ కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఎస్‌జె సూర్య. తమిళ్ లో ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం పూర్తిగా నటుడుగా మారిపోయాడు.


నటుడు నుంచి డైరెక్టర్ గా మారిన హీరోలను చూసాం. కానీ, ఎస్‌జె సూర్య డైరెక్టర్ నుంచి నటుడిగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎస్‌జె సూర్య తెలుగులో సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 29 న రిలీజ్ కు రెడీ అవుతుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఎస్‌జె సూర్య ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు.


” నేను డైరెక్టర్ అవ్వాలని సినిమాల్లోకి రాలేదు. నటుడు అవ్వాలనే డైరెక్టర్ గా మారాను.ముందు చదువుకో అని అమ్మానాన్న చెప్తే.. డిగ్రీ పూర్తిచేసి వారి చేతిలో పెట్టి బయటకు వచ్చేశాను. ఇక నేను బతకడానికి వారి మీద ఆధారపడకుండా ఒక రెస్టారెంట్ లో సర్వర్ గా పనిచేశాను. నాకు నెలకు రూ. 200 ఇచ్చేవారు. పొద్దునే అవకాశాల కోసం వెళ్ళేవాడిని. రాత్రి పనిచేసేవాడిని. ఆ పనిని కూడా ఎంతో శ్రద్దగా చేసేవాడిని.

ఇక ఆ సమయంలో నాకు ఒకటి అర్ధమయ్యింది. నటుడు కావాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉండాలి. అదే నేనే డైరెక్టర్ అయితే అనుకోని డైరెక్టర్ గా మారాను. కానీ, నేను చేసిన సినిమాలకోసం ఎంతో కష్టపడ్డాను. ఇక పవన్ కళ్యాణ్ కు కొమరం పులి, మహేష్ బాబుకు నాని లాంటి ప్లాప్ లు పడ్డందుకు నేను చాలారిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. దానికి కారణం అంటూ ఏమి లేదు. దేవుని ఆశీస్సులు లేవు అంతే .

ఖుషీ తెలుగు, తమిళ్, హిందీలకు నేనే డైరెక్ట్ చేశాను. తెలుగు, తమిళ్ లో హిట్ అయ్యింద హిందీలో ప్లాప్ అయ్యింది. నాని ఇక్కడ ప్లాప్ అయ్యింది తమిళ్ లో హిట్ అయ్యింది. పులి సినిమాకు నేను ఎంత కష్టపడ్డానో అది పవన్ కు నాకే తెలుసు. ఆయన నన్ను నమ్మి ఏం చేయమన్నా చేశారు. హిట్, ప్లాప్ మన చేతుల్లో లేవు ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×