చిత్రం – అమరన్
విడుదల తేదీ – 31 అక్టోబర్ 2024
నటీనటులు – శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్‌తో పాటు తదితరులు
దర్శకులు – రాజ్‌కుమార్ పెరియసామి
నిర్మాత – కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, వివేక్ కృష్ణని
సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
Amaran Movie Review and Rating – 2.75/5
Amaran Movie Review : శివ కార్తికేయ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకి కూడా ఇష్టం పెరిగింది. గతంలో అతను చేసిన ‘డాక్టర్’ ‘డాన్’ వంటి సినిమాలు బాగా ఆడాయి. ఇంకా కొన్ని డబ్బింగ్ అయ్యాయి కానీ.. అవి థియేటర్లో ఆడలేదు. ఓటీటీల్లో పర్వాలేదు అనిపించాయి. తెలుగు డైరెక్టర్ తో చేసిన ‘ప్రిన్స్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. సంక్రాంతికి రావాల్సిన ‘అయలాన్’ విడుదల నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ‘అమరన్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్. తెలుగులో ‘లక్కీ భాస్కర్’ ‘క’ వంటి క్రేజీ సినిమాలు ఉన్నప్పటికీ దీపావళి కానుకగా బయటకి వచ్చిన ‘అమరన్’ లో సాయి పల్లవి హీరోయిన్ కావడం, కమల్ హాసన్ నిర్మాత కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ చిత్రం మ్యాచ్ చేసిందా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
2014లో ఓ మిలిటెంట్ ఆపరేషన్ లో దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన కథ ఇది. ఇంకో మాటలో దీన్ని బయోపిక్ అనాలి. తమిళనాడుకి చెందిన ముకుంద్ కి సరైన ట్రిబ్యూట్ ఇచ్చే ప్రయత్నం ‘అమరన్’ ద్వారా చేశారు. ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్)` చెన్నైకి చెందిన వ్యక్తి. కాలేజీలో ఇందు రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) పరిచయం అతనికి పరిచయం అవ్వడం, ఇద్దరూ ప్రేమలో పడటం జరుగుతుంది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం, ఆర్మీలో చేరడానికి కూడా అతను ఫేస్ చేసిన ఇబ్బందులు … ఆ తర్వాత కశ్మీర్ లోయలోని తీవ్రవాదులను ఎదుర్కోవడం తర్వాత వీరమరణం పొందడం వంటివి చూపించారు.
విశ్లేషణ :
బయోపిక్ లోని ఎమోషన్స్ కరెక్ట్ గా పండాలి అంటే సన్నివేశాలు సహజంగా ఉండాలి. ఫిక్షన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అమరన్ లో అవి ప్లస్ అయ్యాయి. కానీ యాక్షన్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ ఎక్కువ అవ్వడంతో బయోపిక్ ఫీల్ లోపిస్తుంది. అమరన్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. కానీ కొన్ని చోట్ల రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరి అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కి వచ్చే సరికి యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా దట్టించారు. హీరోయిజం బాగా పండింది. కానీ బయోపిక్ కాబట్టి.. సహజత్వం కొంచెం లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. కొత్త హీరోతో చేసి ఉంటే.. నేచురల్ గా ఉండేదేమో. కానీ శివ కార్తికేయన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకోవడం వల్ల ముకుంద్ జీవితాన్ని దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి పక్కదోవ పట్టించాడేమో అనిపిస్తుంది.క్లైమాక్స్ లో ఎమోషన్ బాగా పండింది. కన్నీళ్లు పెట్టించేలానే ఉంది.మరోపక్క కాశ్మీర్ లొకేషన్స్ ను బాగా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఓకే.
నటీనటుల విషయానికి వస్తే.. శివ కార్తికేయన్ ది బెస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు వేరు, ఇది వేరు. ఈ సినిమాతో శివ కార్తికేయన్ సంపూర్ణ నటుడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సాయి పల్లవి నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి. ఇందు రెబెక్కా వర్గీస్ వంటి బరువైన పాత్రలు చేయాలంటే తమిళంలో కానీ, తెలుగులో కానీ… సాయి పల్లవినే బెస్ట్ ఆప్షన్. ‘అమరన్’ తో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. రాహుల్ బోస్, భువన్ అరోరా, గీతా కైలాష్ తదితరులు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
ఎమోషనల్ సన్నివేశాలు
శివ కార్తికేయన్
సాయి పల్లవి
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ టచ్ ఎక్కువ ఇవ్వడం
సహజత్వం తగ్గడం
సెకండాఫ్ లో తొలిసగం
మొత్తంగా.. ‘అమరన్’ ముకుంద్ వరదరాజన్ కి మంచి ట్రిబ్యూట్ అయినప్పటికీ.. యాక్షన్ డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల రెగ్యులర్ ఎమోషనల్ కమర్షియల్ సినిమాలా అనిపిస్తుంది. ఏదేమైనా ఒకసారి చూడదగ్గ విధంగానే ఈ సినిమా ఉంది.
Amaran Movie Review and Rating – 2.75/5