EPAPER

Tillu Square Collections: టిల్లుగాని కోట్ల ఊచకోత.. తుక్కు తుక్కుగా డీజే కొట్టాడుగా..!

Tillu Square Collections: టిల్లుగాని కోట్ల ఊచకోత.. తుక్కు తుక్కుగా డీజే కొట్టాడుగా..!
Tillu Square Collections
Tillu Square Collections

Tillu Square Collections(Today tollywood news): టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కొత్త మూవీ ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మించారు. ఈ సీక్వెల్ చిత్రాన్కి మల్లీక్ రామ్ దర్శకత్వం వహించారు.

మార్చి 29న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఫస్ట్ షో కూడా అద్భుతమైన టాక్‌ను అందుకుంది. అయితే మరి ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్, సినిమా బడ్జెట్, ప్రీరిలీజ్ బిజినెస్ వంటివి ఇప్పుడు తెలుసుకుందాం..


Also Read: ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ రెడీ.. టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు

టిల్లు స్క్వేర్ మూవీపై స్టార్టింగ్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందువల్ల ఈ మూవీని అత్యంత గ్రాండ్‌ లెవెల్లో తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నారు. క్వాలిటీ, కంటెంట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో మరింత బజ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.8 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ.14 కోట్లుకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.22 కోట్ల మేర జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.2 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.4 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకి రూ.28 కోట్ల వరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

Also Read:  ఇండస్ట్రీలో మరో విషాదం.. రామ్ చరణ్ మూవీ నటుడు కన్నుమూత

కాగా ఈ మూవీ ప్రభావం సినీ ప్రేక్షకులపై బాగా పడింది. దీంతో ఫుల్ హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.. ఆంధ్రా, నైజాంలో మొత్తం 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అలాగే కర్ణాటకలో 150 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 50 స్క్రీన్లతోపాటు ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే 1250 స్క్రీన్లలో టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది.

ఇకపోతే ఈ సినిమాకు భారీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ అబ్బురపరచింది. అంతేకాకుండా అమెరికాలో కూడా ఈ మూవీ తన హవా చూపించింది. అక్కడ కూడా తొలి రోజే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసింది. అయితే ఈ వీకెండ్ అంటే ఇవాళ, రేపు కలుపుకుని దాదాపు రూ.50 కోట్లు క్రాస్ చేసేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×