EPAPER

Shiva Balaji as a Naxalite: నక్సలైట్ పాత్రలో శివ బాలాజీ

Shiva Balaji as a Naxalite: నక్సలైట్ పాత్రలో శివ బాలాజీ

Shiva Balaji as a Naxalite: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింధూరం. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శివ బాలాజీ మీడియాతో మాట్లాడారు. ‘‘డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి సింధూరం కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా ఇన్‌టెన్స్‌గా ఉందనిపించింది. అలాగే షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అనిపించింది. డైరెక్టర్ శ్యామ్ బాగా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. నేను మొదటిసారిగా నక్సలైట్ పాత్రలో నటించాను.


నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలను సింధూరం సినిమాలో చూపించాం. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఇదొక నక్సల్ ఇన్ఫార్మర్ కథ. ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.

ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్‌తో సినిమా చేశారు. తమిళ్‌లో ఆల్రెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. హీరో ధర్మ మహేష్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా నేచురల్‌గా చేశాడు. మంచి డైలాగ్స్ బాగా కుదిరాయి. సింధూరం లాంటి కథతో సినిమా రావాలంటే మరో 10 – 15 సంవత్సరాలు తప్పకుండా పడుతుంది. అలాంటి కథ ఇది. సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ఎసెట్ అవుతుంది’’ అన్నారు.


Tags

Related News

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Big Stories

×