EPAPER

Sharwa38 : ఛార్మింగ్ హీరో తో మాస్ డైరక్టర్, ఆ జోనర్ లో సినిమా అంటే కొంచెం రిస్కే

Sharwa38 : ఛార్మింగ్ హీరో తో మాస్ డైరక్టర్, ఆ జోనర్ లో సినిమా అంటే కొంచెం రిస్కే

Sharwa38 : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ చార్మింగ్ హీరోస్ లో శర్వానంద్ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు శర్వా. చాలామంది హీరోలను శర్వానంద్ కెరియర్లో హిట్స్ కంటే ప్లాప్ సినిమాలో ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. శర్వానంద్ కి వరుసగా ప్లాప్ సినిమాలు పడినా కూడా తన మార్కెట్ ఏమాత్రం దెబ్బతినదని చెప్పాలి. దీనికి కారణం శర్వానంద్ వ్యక్తిగత లైఫ్ , మామూలుగా కొన్ని ఇంటర్వ్యూస్ లో సినిమా ఈవెంట్స్ లో శర్వానంద్(Sharwanandh) మాట్లాడే మాటలు చాలామందికి ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. ఇకపోతే శర్వానంద్ కెరియర్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.


ఒకే ఒక జీవితం డీసెంట్ హిట్

రీసెంట్ గా శ్రీ కార్తీక్(Sree Karthik) దర్శకత్వం వహించిన ఒకే ఒక జీవితం మంచి డీసెంట్ హిట్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనమే సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది. ఇక ప్రస్తుతం శర్వానంద్ తన కెరియర్ లో 38వ సినిమాను చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. మొదటిసారి వీరిద్దరూ కలిసి ఒక సినిమా కోసం పనిచేస్తున్నారు.


రచ్చ స్థాయిలో హిట్ లేదు

దర్శకుడు సంపత్ నంది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైంది ఈవేళ(Emaindhi Eevela) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) తో రచ్చ(Raccha) అనే సినిమాను చేసి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సంపత్ నంది ఎన్ని సినిమాలు చేసినా కూడా రచ్చ స్థాయిలో హిట్ సాధించిన సినిమా ఒకటి కూడా లేదు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా చాలా సినిమాలు చేశాడు సంపత్ నంది. వాటిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయిన కూడా గౌతమ్ నంద సినిమాకి మంచి పేరు వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుంది అది అందరూ భావించిన తరుణంలో శర్వానంద్ తో తన ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

Sharwanand

ఈ ప్రాజెక్ట్ ఒక పిరియాడిక్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ జోనర్ లో ఇదివరకే సుధీర్ వర్మ దర్శకత్వంలో రణరంగం(Ranarangam) అనే సినిమాను చేశాడు శర్వానంద్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. మళ్లీ పిరియాడిక్ యాక్షన్ డ్రామా అంటే కొంచెం రిస్క్ సబ్జెక్ట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో అందించనున్నారు.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×