EPAPER

Grammy Awards 2024: గ్రామీ అవార్డుల్లో మనవాళ్లు.. జాకిర్, శంకర్ మహదేవన్ హవా

Grammy Awards 2024: గ్రామీ అవార్డుల్లో మనవాళ్లు.. జాకిర్, శంకర్ మహదేవన్ హవా
Grammy Awards 2024

Grammy Awards 2024 (celebrity news today):


ప్రపంచంలో సినిమాలకు ఆస్కార్ అవార్డు ఎంతో, మ్యూజిక్ లో గ్రామీ అవార్డు (Grammy Awards)కూడా అంతే. ఈ అవార్డును సంగీత పరిశ్రమ ఆస్కార్ అని కూడా అంటారు. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా అందించే 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం వేడుక అమెరికాలో అట్టహాసంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్ లోని కాం ఎరీనాలో ఫిబ్రవరి 4న గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బిల్లీ ఎలిష్, దువా, లిపా, ఒలివియా రోడ్రిగో, ఇతర ప్రముఖ తారల ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ అంతర్జాతీయ అవార్డుల్లో భారతీయ సంగీత కళాకారులు కూడా తమ హవా చూపించారు. భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్‌లు విజయకేతనం ఎగురవేశారు.


అయితే, ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్ తన బ్యాండ్ శక్తి నుంచి కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డులో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును శంకర్ మహదేవన్‌తో పాటు అతని బ్యాండ్ సభ్యులు జాకిర్ హుస్సేన్, జాన్ లాగ్లిన్, సెల్వ గణేష్, గణష్ రాజగోపాలన్ గెలుచుకున్నారు.

దీంతో పాటు జాకిర్ హుస్సేన్ మరో రెండు గ్రామీ అవార్డులను కూడా అందుకున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్శెన్స్ కేటిగిరిలో ‘పాస్తో’ ఆల్బమ్‌కి, టీం బేస్ట్ కాంటెంపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరిలో ‘యాస్ వుయ్ స్పీక్’ ఆల్బమ్‌తో రెండు గ్రామీలను అందుకున్నారు.

మొత్తంగా ఒకేసారి ఆరుగురు భారతీయులు గ్రామీ అవార్డులు అందుకోవడం ఇదే మొదటిసారి. అందులో జాకిర్ హుస్సేన్ ఒకేసారి మూడు అవార్డులు, రాకేష్ చౌరాసియా రెండు అవార్డులను అందుకోవడం విశేషం. గతంలో కూడా జాకిర్ హుస్సేన్ రెండు సార్లు గ్రామీ అవార్డులను అందుకున్నారు.

Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×