EPAPER
Kirrak Couples Episode 1

Shaakuntalam Release date : స‌మంత‌ ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

Shaakuntalam Release date : స‌మంత‌ ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

Shaakuntalam Release date : అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న అద్భుతమైన పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం’. ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కులు 2023లో చూడాల‌నుకుని ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న విజువ‌ల్ వండ‌ర్‌గా శాకుంత‌లం త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. అందాల సుంద‌రి స‌మంత ఇందులో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమ‌గాథ‌నున‌ భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా గుణ‌శేఖ‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు అజ‌రామ‌ర‌మైన ప్రేమ క‌థ‌ ఇది. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.

చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న శాకుంత‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకునే ప‌నిలో ఉంది. శాకుంత‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు నిర్మాత‌లు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ‘శాకుంతలం’ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి ఈ సినిమాను 3Dలో రూపొందిస్తున్నారు.


స‌మంత టైటిల్ పాత్ర‌ధారిగా న‌టించిన శాకుంత‌లం చిత్రంలో డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.

గుణ శేఖ‌ర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ చేసిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణి శ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువ‌ల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్‌, హంగేరిలోని సింఫ‌నీ టెక్నీషియ‌న్స్ చేయ‌టం విశేషం.

Related News

Devara Dialogue : మూవీలో ఈ డైలాగ్ గమనించారా…? పార్ట్ లో దేవర ఫ్లాష్ బ్యాకే హైలైట్..

Janvi Kapoor : ఐఫాలో మెరిసిన ఎన్టీఆర్ బ్యూటీ.. ఆమె ధరించిన నెక్లేస్ ధర అన్ని కోట్లా?

Devara 3 Days Collections: ‘దేవర’ జోరు తగ్గలేదు శీనా.. కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Big Stories

×