EPAPER
Kirrak Couples Episode 1

Shaakuntalam movie review : శాకుంతలం మెప్పించిందా..? మూవీ ఎలా ఉందో తెలుసా..?

Shaakuntalam movie review : శాకుంతలం మెప్పించిందా..? మూవీ ఎలా ఉందో తెలుసా..?

Shaakuntalam movie review(Latest Movie Updates): సమంత‌ తొలి పౌరాణిక చిత్రం శాకుంతలం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత దర్శకుడు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. భారీ గ్రాఫిక్స్ హంగుల‌తో త్రీడీలో ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పాట‌లు, ప్ర‌చార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. మ‌రి ఈ ప్రేమ కావ్యం తెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..?


స్టోరీ ఏంటంటే..?: విశ్వామిత్రుని తపస్సును భ‌గ్నం చేసేందుకు ఇంద్రుని ఆదేశాలతో భూలోకంలోకి మేనక (మధుబాల) అడుగు పెడుతుంది. ఆమె త‌న సౌందర్యంతో ఆకర్షించి విశ్వామిత్రుని త‌ప‌స్సుకు భంగం క‌లిగిస్తుంది. శారీకంగానూ దగ్గరై బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది. అయితే మానవుడి వ‌ల్ల క‌లిగిన సంతానానికి దేవలోకంలో ప్ర‌వేశం లేదు. అందుకే ఆ పాప‌ను భూలోకంలోనే వదిలి మేనక స్వర్గానికి వెళ్లిపోతుంది. ఆ త‌ర్వాత ఆ చిన్నారిని ఓ ప‌క్షుల గుంపు మాలినీ తీరాన ఉన్న క‌ణ్వాశ్ర‌మ ప్రాంతంలో వ‌దిలి వెళుతుంది. కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) ఆ పాప‌ను దైవ ప్ర‌సాదంగా భావించి ద‌త్త తీసుకుంటాడు. శకుంతల అని పేరు పెట్టి.. పెంచి పెద్ద చేస్తాడు.

ఒక రోజు ఆ క‌ణ్వాశ్రమానికి దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) వస్తాడు. శకుంతల (సమంత)ను చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. శ‌కుంత‌ల కూడా దుష్యంతుడి ప్రేమ‌లో పడుతుంది. ఇద్ద‌రూ గాంధ‌ర్వ వివాహంతో ఒక్క‌ట‌వుతారు. కొంత‌కాలం త‌ర్వాత దుష్యంతుడు త‌న రాజ్యానికి వెళతాడు. త్వ‌ర‌లోనే తిరిగి వ‌చ్చి మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని శ‌కుంత‌ల‌కు మాట ఇస్తాడు. ఆ స‌మ‌యంలోనే త‌న గుర్తుగా ఓ ఉంగ‌రం ఇస్తాడు. అప్పటికే శ‌కుంత‌ల‌ గర్భవతి అవుతుంది. దుష్యంతుడు ఎంత‌కీ తిరిగిరాడు. దీంతో శ‌కుంత‌ల‌ను దుష్యంత రాజ్యానికి పంపిస్తాడు క‌ణ్వ మ‌హ‌ర్షి.


క‌ణ్వ‌ మహర్షి ఆశ్రమానికి వెళ్లిన సంగ‌తి గుర్తుంది కానీ.. శకుంతల ఎవరో తనకు తెలియదంటాడు దుష్యంతుడు. ఆయ‌నే భ‌ర్త అని చెప్పుకోవ‌డానికి ఉన్న ఒక్క ఆధారం ఉంగ‌రాన్ని పోగొట్టుకుంటుంది శ‌కుంత‌ల‌. దీంతో నిండు స‌భ‌లో ఆమె తీవ్ర అవ‌మానాన్ని ఎదుర్కొంటుంది. మ‌రి దుష్యంతుడు.. శ‌కుంత‌ల‌ను మ‌ర్చిపోవ‌డానికి కార‌ణ‌మేంటి ? వీళ్లిద్ద‌రూ తిరిగి ఎలా క‌లిశారు? వీరు విడిపోవ‌డానికి దుర్వాస మహాముని (మోహన్ బాబు)కి ఉన్న సంబంధం ఏంటి ? దుష్యంతుడికి శ‌కుంత‌ల‌ను ద‌క్క‌కుండా చేయాల‌న్న అసుర మూక కాలానీముల ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లమ‌య్యాయా?లేదా? అస‌లు వీళ్ల‌కు ఈ క‌థ‌కు ఉన్న సంబంధం ఏంటి ? ఈ విషయాలు సినిమా చూస్తూ తెలుసుకుంటేనే కిక్కు ఉంటుంది.

మూవీ ఎలా ఉందంటే..?: కాళిదాసు ర‌చించిన సంస్కృత నాట‌కం అభిజ్ఞాన శాకుంత‌లంలోని శ‌కుంత‌ల – దుష్యంతుల ప్రేమ‌కావ్యాన్ని తెర‌పై ఓ అపురూప దృశ్య కావ్యంలా అందంగా ఆవిష్క‌రింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు గుణ‌శేఖ‌ర్‌. చిన్నారి శ‌కుంత‌ల‌ను ఓ ప‌క్షుల గుంపు క‌ణ్వాశ్ర‌మానికి తీసుకురావ‌డంతో క‌థ ప్రారంభ‌మ‌వుతుంది. ఆ ఆశ్ర‌మ ప్రాంతం.. జంతువులు, ప‌క్షులతో శ‌కుంత‌ల‌కు ఉన్న అనుబంధాలు ప‌రిచ‌యం చేస్తూ నెమ్మ‌దిగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దుష్యంతుడి పాత్ర ప‌రిచ‌య స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. శ‌కుంత‌ల‌కు దుష్యంతుడు ఎదురుప‌డే స‌న్నివేశాల్ని చ‌క్క‌గా తీర్చిదిద్దారు.

దుర్వాస మ‌హ‌ర్షి ఎంట్రీ క‌థ‌ను ఒక్క‌సారిగా మ‌లుపు తిప్పుతుంది. ఆయ‌న ఎపిసోడ్‌తోనే విరామ‌మిచ్చి సినిమాపై ఉత్సుకత పెంచారు. దుష్యంతుడి రాజ్యానికి శ‌కుంత‌ల వెళ్ల‌డం.. నిండు స‌భ‌లో ఆమె అవ‌మాన ప‌డ‌టం.. ప్ర‌జ‌లు రాళ్ల‌తో కొట్టి చంపే ప్ర‌య‌త్నం చేసే స‌న్నివేశాలతో ద్వితీయార్ధం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. శ‌కుంత‌ల – దుష్యంతుడు తిరిగి ఎలా క‌లిశార‌న్న విష‌యాన్ని ఆస‌క్తిక‌రంగా ముగింపు ఇస్తే ఇంకా బాగుండేది. ప‌తాక స‌న్నివేశాల్లో భ‌ర‌తుడిగా అల్లు అర్హ ఎంట్రీ.. దుష్యంతుడితో ఆమె వాద‌న మాత్రం ఆక‌ట్టుకుంటాయి.

ఎవ‌రెలా చేశారంటే ..? : శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత ఒదిగిపోయింది. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్‌ ఆకట్టుకున్నాడు. దుర్వాస మ‌హ‌ర్షి పాత్ర‌కు మోహ‌న్‌బాబు జీవం పోశారు. స‌చిన్‌, అన‌న్య‌, మ‌ధుబాల‌, జిషు సేన్ గుప్తా పాత్రల పరిధి మేరకు నటించారు. ప‌తాక స‌న్నివేశాల్లో అల్లు అర్హ న‌ట‌న అబ్బురుపరిచింది. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌కు ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంది. సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , సాంగ్స్ ప్రధాన బలంగా నిలిచాయి.

నటీనటులు : సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్‌, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ
సినిమాటోగ్రఫీ : శేఖర్‌ వి.జోసెఫ్‌
ఎడిటింగ్‌ : ప్రవీణ్‌ పూడి
సంగీతం : మణిశర్మ
మాటలు : సాయి మాధవ్‌ బుర్రా
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గుణశేఖర్
నిర్మాణ సంస్థ : గుణ టీమ్‌వర్క్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌

Follow this link for more updates:- Big tv Live News Telugu

Tags

Related News

Mamitha Baiju : తెలుగు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ.. ఫ్యాన్స్ హర్ట్..

Akira : మెగా ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్.. చిరు సినిమాలో అకిరా..?

Rajinikanth: రజినీకాంత్ ను పరామర్శించిన సీఎం.. కాల్ చేసి మరీ..

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి.. నివాళులు అర్పించిన అల్లు అర్జున్

Devara 2: మూవీలో ఈ హింట్‌ను గమనించారా.? సీక్వెల్ మొత్తం బ్లడ్ బాత్ పక్కా..

Srinu Vaitla: వెంకీట్రైన్ ఎపిసోడ్.. స్క్రిప్ట్ లో లేదు.. వాళ్లకే థాంక్స్ చెప్పాలి

Thalapathy69: విజయ్ చివరి సినిమా.. బాలయ్య హిట్ సినిమాకు రీమేక్ అని మీకు తెలుసా.. ?

Big Stories

×