EPAPER

Director vk prakash: మలయాళ దర్శకుడు వీకే ప్రకాష్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

Director vk prakash: మలయాళ దర్శకుడు వీకే ప్రకాష్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

Sexual harassment case filed on malayalam film director vk prakash justice hema committee report: హేమ కమిటీ నివేదికతో ఒక్కసారిగా మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పట్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఒక్కొక్కరుగా పరిశ్రమ పెద్దల పేర్తు బయటపెట్టడంతో అనేక సంచల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో వీకే ప్రకాష్ కు మంచి పేరు ఉంది. మొదట కమర్షియల్ యాడ్స్ డైరెక్టర్ గా కెరీర్ ఆరంభించారు ప్రకాష్. 2000 సంవత్సరంలోపునరాధివాసం అనే మూవీతో తొలిసారిగా దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. తొలి చిత్రమే జాతీయ పురస్కారం అందుకుంది. అలాగే వీకే ప్రకాష్ ఉత్తమ దర్శకుడిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకున్నారు. మలయాళ, కన్నడ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగానూ కొన్ని సినిమాలలో చేశారు. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాలోనూ నటించారు. అయితే వీకే ప్రకాష్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయింది.


హోటల్ లో అసభ్య ప్రవర్తన

2022 సంవత్సరంలో తాను వీకేకు ఓ కథ చెప్పేందుకు కొల్లాం ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ కి వెళ్లానని..ఆ సమయంలో వీకే తనతో అసభ్యంగా ప్రవర్తించారని..లైంగిక వేధింపులకు గురిచేశారని..ఎవరికైనా చెబితే తన కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించారని ఓ మహిళా స్క్రిప్ట్ రైటర్ హేమ కమిటీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో తన కెరీర్ కు భయపడి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచానని..ఇప్పుడే ధైర్యంగా ఆయనపై ఫిర్యాదు చేస్తున్నానని..ఎలాగైనా ఆయనకు శిక్ష పడాలని తాను కోరుకుంటున్నానని హేమ కమిటీకి ఫిర్యాదు చేయడంతో వీకే ప్రకాష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హేమ కమిటీ నివేదిక ఆధారంగా పోలీసులు వీకే ప్రకాష్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. దీనితో దర్శకుడు వీకే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టు ను ఆశ్రయించారు. తాను ఏమిటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని..కావాలని తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఆ మహిళ చేస్తున్న కుట్ర అని..తనని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని జీవీ ప్రకాష్ చెబుతున్నారు.


బ్లాక్ మెయిల్ కేసు

ఈ విషయంలో తన క్లయింట్ నిర్దోషి అని కేవలం డబ్బు కోసమే ఇలాంటి చిల్లర కేసులు పెడుతుంటారని..కేవలం ఉద్దేశ పూర్వకమయిన ఆరోపణలు తప్ప..వీటిలో ఎలాంటి ఆధారాలు ఉండవని జీవీ ప్రకాష్ తరపున న్యాయవాది తెలిపారు.
ఇప్పటికే 17 మంది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే జీవీ ప్రకాష్ ది పదవ కేసు. జీవీకి ముందు సిద్దిఖీ, జయసూర్య, ముఖేష్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు అమ్మ అసోసియేషన్ కు రాజీనామా చేయడంతో ఆ అసోసియేషన్ మొత్తం రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం అమ్మా అసోసియేషన్ రద్దయింది.

హేమ కమిటీ ప్రకంపనలు

మలయాళ చిత్ర సీమలో హేమ కమిటీ నివేదిక సృష్టిస్తున్న ప్రకంపనలు ఇతర రాష్ట్రాల కూ చుట్టుకోనుంది. కోలీవుడ్, శాండల్ వుడ్ లోనూ ఇలాంటి కమిటీలు వేయిస్తే నిందితులు బయటకు వస్తారని..ఎందరో అామాయక ఆడపిల్లలకు న్యాయం జరుగుతుందని ఇతర పరిశ్రమలకు చెందిన కొందరు సినీ ప్రముఖులు కోరుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఆడవారికి అవకాశాలు ఇస్తామని కొందరు పెద్దల మాటున చేస్తున్న చిల్లర వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

 

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×