EPAPER

Actress Radhika: జర్నలిస్టులపై మండిపడుతున్న రాధిక.. ఎందుకో తెలిస్తే మీరూ స్పందిస్తారు

Actress Radhika: జర్నలిస్టులపై మండిపడుతున్న రాధిక.. ఎందుకో తెలిస్తే మీరూ స్పందిస్తారు

Senior actress Radhika fire on some youtube channels about fake news: సీనియర్ నటి రాధిక..ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్. ఎఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో నటించింది. చిరంజీవి సరసన హిట్ పెయిర్ గా చెప్పుకునేవారు అప్పట్లో. రాధిక స్వాతిముత్యంలో నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన కిళక్కేపోగుమ్ మూవీతో సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది రాధిక. 1978లో విడుదలైన ఆ మూవీ సూపర్ హిట్ అయింది. నటించిన తొలి చిత్రమే విజయవంతం కావడంతో రాధిక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేద. దాదాపు సౌత్ లో తమిళ, మలయాళ, తెలుగు సినిమాలతో సహా కొన్ని హిందీ సినిమాలలోనూ చేసి మల్టీ టాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు పొందింది.


సొంత ప్రొడక్షన్ హౌస్

ప్రస్తుతం క్యారెక్టర్ యాక్ట్రెస్ గా నటిస్తోంది. ప్రతాప్ పోతన్ తో విడాకులు తీసుకుని హీరో శరత్ కుమార్ ని పెండ్లాడింది. కొన్ని తమిళ సీరీయల్స్ కూడా నిర్మించింది. సొంతంగా రాడార్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించింది. రాజకీయాలలోనూ కొంతకాలం రాణించింది. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులపై మండిపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఛానళ్లు సినీ తారల వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి వారి పర్సనల్ లైఫ్ గురించి అభ్యంతరకర కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఫలానా హీరోయిన్ కు ఫలానా వారితో ఎఫైర్ ఉందని, రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను పీడిస్తుంటారని, వాళ్ల క్యారెక్టర్ మంచిది కాదని ఇలా పలురకాలుగా సెలబ్రిటీల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో అలాంటి ఛానల్స్ నిర్వాహకులు, జర్నలిస్టులపై కఠినచర్యలు తీసుకోవాలని తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ కు వినతి పత్రం సమర్పించారు.


గాసిప్స్ పేరుతో బజారుకీడుస్తున్నారు

నడిగర సంఘం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని..అలాంటి చానల్స్ ను ప్రెస్ మీట్స్ కు ఆహ్వానించకూడదని, అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అన్నారు. తెల్లారి చూస్తే గాసిప్స్ పేరిట హీరోయిన్ల పర్సనల్ లైఫ్ పై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. యూట్యూబ్ ఛానల్సే కాదు కొన్ని పత్రికలు కూడా ఇలాంటి అసత్య వార్తలు రాస్తూ ఎదుటివారి జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. గాసిప్స్ అంటే అందంగా, హుందాగా ఉండాలి కానీ ఎదుటివారిని కించపరిచేలా ఉండకూడదని ఆమె అంటున్నారు.

టాలీవుడ్ తరహాలో చర్యలు

టాలీవుడ్ లోనూ ఇలాంటి వ్యవహారంపై మా అసోసియేషన్ తరపున మంచు విష్ణు 18 ఛానల్స్ పై టాలీవుడ్ నిషేధం విధించారని..వారికి ఎట్టిపరిస్థితిలోనూ సినీ రంగం నుంచి సహకారాలు ఉండవని..ఇక వారు వార్తా ప్రసారాలు చేసే హక్కు కోల్పోయేలా చేశారు. ఇప్పుడు మంచు విష్ణు తరహాలో తమిళనాడు సినిమా ఇండస్ట్రీలోనూ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×