EPAPER

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Comedian Satya: కామెడీ లేని సినిమా.. ఉప్పు లేని పప్పుచారు లాంటిది అని చెప్పడంలో  ఎటువంటి అతిశయోక్తి లేదు.  ఒకప్పుడు సినిమాలు చూసుకుంటే.. అందులో కమెడియన్స్ ఎంతమంది ఉన్నారు అని లెక్కపెట్టడం కష్టం అయ్యేది. కానీ, ఇప్పుడు ఒక సినిమాలో కమెడియన్స్ ఉన్నారా.. ?  అసలు తెలియదే అని చెప్పుకొచ్చేస్తున్నారు. అంతలా ఈ జనరేషన్ మారిపోయింది. కొంతమంది కమెడియన్స్  ను రీప్లేస్  చేయడం అనేది ఈ జనరేషన్ లో ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటింది  హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో పోల్చడం అనేది  గ్రేట్  హానర్ అని చెప్పొచ్చు.  ఈ కాలంలో అంతగా బ్రహ్మీని  మైమరిపించేలా  చేసిన కమెడియన్ ఎవరు అంటే.. సత్య.


మత్తు వదలరా 2 తరువాత సత్య కామెడీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగుసినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం  అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సత్య గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సత్య పూర్తిపేరు  సత్య ఆకుల. అమలాపురం కుర్రాడు. చదువు పూర్తిచేసి.. ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఆశ. ఆ సమయంలో థియేటర్ లో వేణు మాధవ్ నటించిన భూ కైలాస్ సినిమా చూడడానికి వెళ్ళగా .. అక్కడ ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం విని.. వారితో పరిచయం చేసుకున్నాడు. వెళ్లేముందు వారు.. రేపు షూటింగ్ కు రమ్మని చెప్పడంతో  ఉదయాన్నే రూ.500 తీసుకుని జూనియర్ ఆర్టిస్టుగా అతన్ని ఓ సినిమా షూటింగ్‌కి పంపించారు. అక్కడకు వెళ్లిన సత్య వద్దనుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ డబ్బులు తీసుకొని పారిపోయాడు. చేతిలో డబ్బులు లేక మూడురోజులు తినకుండా  పస్తులు ఉన్నాడు.

Gorre Puranam Trailer: గొర్రె పురాణం.. మళ్లీ కొత్త కథతో వస్తున్న సుహాస్


ఇక ఆకలికి తట్టుకోలేక తల్లికి కాల్ చేసి విషయం చెప్పడంతో.. అలా సత్య తండ్రి హైదరాబాద్ వచ్చి.. తనకు తెల్సిన ఫ్రెండ్ రాజమౌళివద్ద పని చేస్తుంటే అతనివద్దకు పంపాడు. అలా నితిన్ హీరోగా  నటించిన ద్రోణ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా  కెరీర్  ప్రారంభించాడు. ఆ తరువాత ఫేమస్ కామెడీ  సీరియల్ అమృతం కు కూడా అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ  తరువాత స్టార్  హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. పిల్ల జమీందార్, గబ్బర్ సింగ్,  స్వామి రారా.. ఇలా చాలా సినిమాల్లో  హీరో  ఫ్రెండ్ గా కనిపించాడు. ఇక సత్యను కమెడియన్  గా  మార్చింది మాత్రం ఛలో. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో సత్య కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాకు గాను బెస్ట్ కమెడియన్ అవార్డ్ ను కూడా అందుకున్నాడు.

ఒకప్పుడు కమెడియన్ సునీల్  లేకుండా సినిమా తీయడానికి మేకర్స్ ఇష్టపడేవారు కాదట..  ఇప్పుడు సత్య లేకుండా  సినిమా అంటే  మేకర్స్ కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఇదంతా  ఒక ఎత్తు  అయితే మత్తు వదలరా సినిమాతో  సత్య స్టార్ కమెడియన్  లిస్ట్ లోచేరిపోయాడు. యేసు పాత్రలో సత్య నటించాడు  అని చెప్పడం కంటే  జీవించాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మత్తు వదలరా 2 సత్య జీవితాన్నే మార్చేసింది. ముఖ్యంగా చిరంజీవి డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఒక సినిమాలో  హీరో ఉన్నాడా.. ?   లేదా అని ఎవరు  ఆలోచించలేదు అంటే .. దానికి కారణం సత్య అనే చెప్పాలి.   ఇలాంటి కామెడీ చేయడం  అందరి వలన కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే  ఇంకొక విషయం ఏంటంటే..  కొద్దిగా పేరు రాగానే  కమెడియన్స్  హీరోలుగా మారుతున్నారు.

Siddharth: సమంతతో సహా సిద్దార్థ్ ఎఫైర్స్.. అదితి ఎన్నో భార్యనో తెలుసా.. ?

కమెడియన్ గా ఆదరించిన ప్రేక్షకులు హీరోగా ఆదరించారా.. ? అని రాంగ్   టర్న్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కమెడియన్ గా సక్సెస్ అయ్యి హీరోగా   మారినవారు సక్సెస్ అందుకోలేదు  అని చెప్పాలి. చివరికి బ్రహ్మానందం కూడా హీరోగా ఫెయిల్ అయ్యాడు.  ఇప్పుడు సత్య అదే  తప్పు చేయొద్దు  అని చెప్తున్నారు ప్రేక్షకులు. సునీల్ ఇలానే హీరోగా మారి.. ఏదో సాధిద్దామనుకున్నాడు .. కానీ , జరిగింది వేరు.  సత్య ఇప్పటికే హీరోగా వివాహ  భోజనంబు చేశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.  దీంతో హీరోగా సినిమాలు చేయడం ఆపేశాడు. ఇప్పుడు కూడా పేరు వచ్చిందని హీరోగా మారకుండా ఇలానే కామెడీ  అందిస్తే.. కచ్చితంగా సత్య మరో బ్రహ్మానందం అవుతాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి సత్య ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Related News

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Adithi Rao – Siddarth : అప్పుడే భర్తకు చుక్కలు చూపిస్తున్న అదితి.. కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..

Big Stories

×