EPAPER
Kirrak Couples Episode 1

Sathyam Sundaram First Review: బావా బామ్మర్దులు మెప్పించారా..?

Sathyam Sundaram First Review: బావా బామ్మర్దులు మెప్పించారా..?

Sathyam Sundaram First Review : ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi ) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, మాస్ పర్ఫామెన్స్ తో ఎలాంటి పాత్రలోనైనా సరే లీనమైపోయి నటించగలిగే సత్తా ఈయనది. అటు విలనిజం చూపించడంలో నైనా.. ఇటు కామెడీ పండించడంలో కూడా కార్తీ సక్సెస్ అయ్యారు. అందుకే కార్తీ సినిమాలంటే అటు తమిళ్ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా కార్తి నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అవడం వల్ల తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.


తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే..

Sathyam Sundaram First Review: Did Bava Bammardulu like it..?
Sathyam Sundaram First Review: Did Bava Bammardulu like it..?

ముఖ్యంగా ఆవారా, ఖైదీ, సర్దార్ వంటి సినిమాలు కార్తీకి తెలుగులో కూడా మంచి విజయాన్ని అందించాయి. అయితే గత ఏడాది వచ్చిన జపాన్ సినిమా మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి. దీంతో ఎలాగైనా సరే ఏడాది సక్సెస్ అవ్వాలనుకున్న కార్తి ‘సత్యం సుందరం’ అనే సినిమాతో సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ్‌లో 96 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సి. ప్రేమ్ కుమార్ ఇదే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు జాను గా అందించారు. అయితే ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించలేదు. ఇప్పుడు కార్తీ నటించిన సత్యం సుందరం అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది డబ్బింగ్ కాబట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చే అవకాశం కనిపిస్తోంది.


బయ్యర్స్ ఫస్ట్ రివ్యూ..

కార్తీ అన్నా వదిన అయిన సూర్య – జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక కార్తీతో పాటు ప్రముఖ హీరో అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఇందులో అరవింద్ స్వామి బావబామ్మర్దిగా కార్తీ నటించారు. ఇక ఈ చిత్రం చూసిన తెలుగు బయ్యర్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. బయ్యర్స్ చెబుతున్న రివ్యూ ప్రకారం.. అరవింద స్వామి, కార్తీ ఇద్దరూ బావబామ్మర్దులుగా ఈ చిత్రంలో నటిస్తున్నారట. 96 మాదిరే ఈ సినిమాను కూడా ఎక్కువ శాతం నైట్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించినట్లు వారు చెబుతున్నారు.

ట్విస్ట్ ఇచ్చిన కోసమైనా సినిమా చూడాల్సిందే..

మొత్తంగా సినిమాలో చాలా భాగం వీరే కనిపిస్తారట. ఇందులో శ్రీదివ్య, దేవదర్శిని, స్వాతి కొండే వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే అరవింద్ స్వామి, కార్తీల బ్రోమాన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అని కూడా బయ్యర్స్ చెప్పుకొస్తున్నారు. వీరి సన్నివేశాలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాయని, ఇందులో కార్తీ జీవించేసాడని అందరి చేత కంటతడి పెట్టించడం ఖాయం అని కూడా చెబుతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని, ముఖ్యంగా ఆ ట్విస్ట్ కోసమైనా ఈ సినిమా చూడాలని చెబుతున్నారు మొత్తానికైతే ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు అంటూ చెబుతున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 27వ తేదీన ఎన్టీఆర్ దేవర భారీ బడ్జెట్ తో రాబోతోంది. మరి అలాంటి చిత్రం ముందు ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Natanshi Goel : “లాపతా లేడీస్”లో పూల్ కుమారి వయసు తెలిస్తే షాక్

Chiranjeevi : చిరు సీక్రెట్ ఫామ్ హౌస్… ఎక్కడుంది? ధర ఎంతో తెలుసా?

Prasanth Varma : క్రేజీ అంటే ఇదే మామా… ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో తమిళ్ స్టార్..

Pawan Kalyan : జోకులు వద్దు… హీరో కార్తీ పై పవన్ కళ్యాణ్ ఫైర్..

Parvati Nair: పనిమనిషి కంప్లైంట్.. హీరోయిన్ పై కేస్ ఫైల్.. అసలేమైందంటే..?

Devara bookings: తెరుచుకున్న దేవర టికెట్ బుకింగ్స్.. ఎగబడుతున్న ఫ్యాన్స్..!

Big Stories

×