EPAPER
Kirrak Couples Episode 1

Sathya Dev: సైడ్ అయ్యాడా? లేక వదిలేశారా..?

Sathya Dev: సైడ్ అయ్యాడా? లేక వదిలేశారా..?

Sathya Dev.. ప్రముఖ హీరో సత్యదేవ్ (Sathyadev) .. సాఫ్ట్వేర్ గా కెరియర్ మొదలుపెట్టి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుని విశాఖపట్నంలో షార్ట్ ఫిలిం మేకర్ గా తన వృత్తిని కొనసాగించి, ఆ తర్వాత 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంతో తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకుంద వంటి చిత్రాలలో కూడా సైడ్ యాక్టర్ గానే నటించారు. అయితే మొదటిసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి చిత్రంలో ప్రధాన పాత్ర కోసం 500 మందిని ఆడిషన్ చేయగా సత్య మాత్రమే హీరోగా ఎంపికయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. కానీ సత్యదేవ్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు.


బోలెడు చిత్రాలు.. గుర్తింపు మాత్రం జీరో..

ఈ సినిమా తర్వాత మన ఊరి రామాయణంలో నటించారు. ఇది పెద్దగా ఆయనకు కలిసి రాలేదని చెప్పాలి. అంతేకాదు 2020లో నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలో కూడా నటించారు. దీనికి తోడు తెలుగులోనే కాదు హిందీలో కూడా పలు చిత్రాలలో నటించారు సత్యదేవ్. ఉదాహరణకు మైనే ప్యార్ కియా, అసుర, లెటర్, క్షణం, అప్పట్లో ఒకడుండేవాడు, ఘాజి , రోగ్, ఆక్సిజన్, అంతరిక్షం, బ్రోచేవారెవరురా, ఇస్మార్ట్ శంకర్ , జార్జిరెడ్డి, రాగల 24 గంటల్లో, 47 డేస్, సరిలేరు నీకెవ్వరు, గువ్వా గోరింక, పిట్ట కథలు, తిమ్మరసు స్కై ల్యాబ్, ఆచార్య, గాడ్సే, గుర్తుందా శీతాకాలం, చివరిగా కృష్ణమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు కానీ ఏ ఒక్క పాత్ర కూడా గుర్తింపును అందివ్వలేకపోయింది.


నటన ఒకటే కాదు అదృష్టం కూడా ఉండాలి..

దీనికి తోడు ఈ మధ్యకాలంలో అసలు ఈయనకు కలసి రాలేదనే చెప్పాలి. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.నిజానికి ఎన్నో చిత్రాలలో నటించినా సరైన సక్సెస్ లేక అవకాశాలు తలుపు తట్టక సైడ్ అయిపోయాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో నటన మాత్రమే ఉంటే సరిపోదు అందుకు తగ్గట్టుగా అదృష్టం కూడా ఉండాలి. అది లేకే ఈయనకు అవకాశాలు రావడం లేదని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి సత్యదేవ్ కు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదో లేక ఎవరు ఇవ్వడం లేదో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

అవకాశాలు లేకే సైడ్ అయ్యారా..

ఇకపోతే ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో మాత్రం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు సత్యదేవ్. ఈ నేపథ్యంలోని ఈయనకు సంబంధించిన సినిమాలేవి కనిపించకపోవడంతో ఆడియన్స్ లో ఇలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సత్య నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. 2018లో వచ్చిన నవాబ్, సాహో, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలలో కొన్ని పాత్రలకు డబ్బింగ్ అందించారు సత్య. అలాగే రెండు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. ఇన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటించిన సత్యకి మాత్రం గుర్తింపు రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఇకనైనా కథల ఎంపిక విషయంలో ఆడియన్స్ ను అలరించాలని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం.

Related News

Anushka: అతనితోనే అనుష్క పెళ్లి.. ప్రభాస్ పరిస్థితి ఏంటి.. ?

Karthi: తిరుపతి లడ్డూ వివాదం.. కార్తీ క్షమాపణ అంతా స్ట్రాటజీనా..?

Jagapathi Babu: నీకు నాకు కొవ్వు ఎక్కువ.. మంచు వారసురాలిని పట్టుకొని అంత మాట అనేశాడు ఏంటి.. ?

Puri Jagannadh: ఇంటికొచ్చిన ఫ్యాన్స్ తో ముంబాయి నుంచి వీడియో కాల్ మాట్లాడిన పూరి జగన్నాథ్

Game Changer: బాబోయ్ రామ్ చరణ్ శంకర్ సాంగ్ ఇలా ఉంది ఏంటి ?

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Big Stories

×