EPAPER

Saripodhaa Sanivaaram Review: ‘సరిపోదా శనివారం’ మూవీ ఫుల్ రివ్యూ.. నాని హిట్ కొట్టాడా?

Saripodhaa Sanivaaram Review: ‘సరిపోదా శనివారం’ మూవీ ఫుల్ రివ్యూ.. నాని హిట్ కొట్టాడా?

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ నుంచి ఎన్నో అంచనాలు క్రియేట్ చేసుకుంది. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ఎన్నో అప్డేట్‌లతో మేకర్స్ సినీ ప్రేక్షకాభిమానుల్ని ఉర్రూతలూగించారు. అయితే అభిమానుల్లో కాస్త భయం కూడా ఉంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. అందువల్ల మళ్లీ వివేక్‌తో నాని జోడీ కట్టడంతో అందరిలోనూ కాస్త భయం ఏర్పడింది. మరి ఇప్పుడు సరిపోదా శనివారంతో వచ్చిన ఈ కాంబో హిట్ కొట్టిందా? లేదా? ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చిందా? లేదా? అనేది ఇప్పుడు ఫుల్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.


కథ

ఈ సినిమాలో సూర్య (నాని)కి విపరీతమైన కోపం. అయితే అతడి కోపాన్ని కంట్రోల్ చేయడానికి అతడి తల్లి చాయాదేవి (అభిరామి) ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఓ రోజు ఒక కండీషన్ పెడుతుంది. సూర్యకు తన కోపాన్ని వారమంతా కాకుండా ఏదో ఒక రోజు ఎంచుకోమని చెప్తుంది. అనంతరం ఆమె చనిపోతుంది. ఆ తర్వాత సూర్య తన కోపాన్ని కేవలం శనివారం మాత్రమే చూపించాలని ఫిక్స్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో వైపు సోకులపాలెంలో ఎస్సై దయానంద్ (ఎస్ జే సూర్య) తన కోపంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంటాడు.


ఎవరు దొరికితే వారికి చిత్ర హింసలు పెట్టి తన ఆనందాన్ని పొందుతాడు. అయితే అతడి అన్న అయిన ఎమ్మెల్యే కూర్మానంద్ (మురళీ శర్మ)తో గొడవలు ఉంటాయి. అన్నదమ్ములైన ఎస్సై దయానంద్, ఎమ్మెల్యే కూర్మానంద్ మధ్య ల్యాండ్ సమస్యలు ఉంటాయి. అందువల్ల తన అన్నను ఎలాగైనా చంపాలని దయానంద్ ప్లాన్‌ వేస్తాడు. అయితే అదే సమయంలో కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) సూర్యను సోకులపాలెం తీసుకొస్తుంది. ఆ తర్వాత సూర్యకు, దయానంద్‌కు మధ్య వైరం ఎలా ఏర్పడింది. సూర్యను చారులత సోకులపాలెం తీసుకొచ్చి ఏం చేస్తుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.

విశ్లేషణ

Also Read: నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

ఈ సినిమా లాంటి స్టోరీలు ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. ప్రతి సినిమాలోనూ ప్రజలను హింసించే విలన్ ఉంటాడు. అదే సమయంలో వారిని కాపాడే హీరో కూడా ఉంటాడు. ఇలాంటి పాయింట్‌తోనే దర్శకుడు వివేక్ ఆత్రేయ వచ్చాడు. ఇందులో కూడా దాదాపు అన్ని సినిమాల మాదిరిగానే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ టచ్ అవుతాయి. అయితే ఇందులో కాస్త డిఫరెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది నాని క్యారెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సినిమాలో హీరో యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడు. కానీ ఇందులో హీరో కేవలం ఒక్కరోజు మాత్రమే తన కోపాన్ని, హీరోయిజాన్ని చూపిస్తుంటాడు. అయితే ఇక్కడే ఓ లాజిక్ రావోచ్చు. హీరోకి ఒక్కరోజు మాత్రమే కోపం వస్తుంది కదా మరి మిగతా రోజుల్లో అతడ్ని కొట్టేయొచ్చు కదా అని అనుకుంటారు. అలాంటా లాజిక్ వెతికితే ఈ సినిమా చూడలేరు.

వివేక్ ఆత్రేయ నుంచి ఇలాంటి మాస్ యాక్షన్ సినిమాను ఎవరూ ఊహించలేకపోయారు. తనదైన శైలిలో సినిమాను చిత్రీకరించి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం తన క్రియేటివిటీతో కట్టిపడేశాడు. ముఖ్యంగా సూర్య పాత్రలో నానిని చూపించే విధానం అదిరిపోయింది. అలాగే విలన్‌గా నటించిన ఎస్ జే సూర్య ఎలివేషన్స్ అబ్బో అదిరిపోయాయనే చెప్పాలి. అలాగే హీరో సూర్య, విలన్ దయానంద్ మధ్య గొడవలు ఎలా ప్రారంభమయ్యాయి అనే సన్నివేశాలను దర్శకుడు చూపించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే క్యారెక్టర్లను చూపించే ప్రయత్నంలోనే ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపొయినట్లు అనిపిస్తుంది. అతేకాకుండా ఫస్ట్ హాఫ్‌లో కాస్త సాగదీసిన ఫీలింగ్ కూడా కొందరిలో కలుగుతుంది.

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మొత్తం క్యూరియాసిటీ పెంచేలా దర్శకుడు రాసుకున్నాడు. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య పోటీ ఏ విధంగా ఉంటుందో ఇంటర్వెల్ ముందు చూపించి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేశాడు. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి కొత్తగా అనిపించే సన్నివేశాలు పెద్దగా ఏం కనిపించవు. ఎప్పుడూ చూసే సీన్లను మళ్లీ మళ్లీ చూసినట్లు అనిపిస్తుంది. కానీ మరికొన్ని సన్నివేశాలు మాత్రం సరికొత్తదనాన్ని అందిస్తాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా సరికొత్తగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫస్ట్ హాఫ్‌లో హీరో చిన్నతనం, తల్లి చెప్పే సూక్తులు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, హీరో, విలన్ ఎంట్రీ ఇలా అన్నింటిని డివైడ్ చేసి చూపించాడు. ఫస్ట్ హాఫ్ దర్శకుడు బాగా రాసుకున్నాడు.

అయితే సెకండాఫ్‌కి వచ్చే సరికి తేలిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఎమోషన్స్ అంతగా పండించలేకపోయాడు. అయితే హీరో విలన్ల మధ్య ఇంట్రెస్టింగ్ సీన్లు చూపించి అదరగొట్టేశాడు. అంతేకాకుండా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా బాగుంది. అయితే ఈ మూవీలో నాని, ఎస్‌జే సూర్యల యాక్టింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. వారి నటన ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఎస్ జే స్యూర్య పాత్రకే దర్శకుడు ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్లు అనిపిస్తుంది.

ఇక చారులత పాత్రలో ప్రియాంక మోహన్ పర్వాలేదనిపించింది. తెరపై ఓ బొమ్మల కనిపిస్తుందంతే.. అలాగే సాయి కుమార్‌ పాత్ర బాగుంది. తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా మిగతా నటీ నటుల పాత్రలు ఆకట్టుకున్నాయి. అలాగే టెక్నికల్ టీంను కూడా దర్శకుడు బాగా వాడుకున్నాడు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఆర్ఆర్ చాలా బాగుంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. కొత్తదనం కాకుండా ఉన్నంత సేపు ఎంటర్‌టైన్ చేస్తే చాలు అనుకునేవారికి ఈ మూవీ సరిపోతుంది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×