EPAPER

Salaar Vs Dunki: సలార్ పై డుంకీ మాస్టర్ ప్లాన్.. ఒకరోజు ముందే రిలీజ్..

Salaar Vs Dunki: సలార్ పై డుంకీ మాస్టర్ ప్లాన్.. ఒకరోజు ముందే రిలీజ్..

Salaar Vs Dunki: బాలీవుడ్ బాద్షా టాలీవుడ్ ని కూడా గత కొద్ది కాలంగా టార్గెట్ చేస్తున్నాడు. డిసెంబర్ నెల వస్తోంది అంటే ఆ రెండు సినిమాల మధ్య వార్ కు సిద్ధం .. అనే మాట బాగా వినిపిస్తోంది. మామూలుగా దసరాకి లేక సంక్రాంతి పండగలకి అగ్ర హీరోల మధ్య పోటీ ఉండడం చాలా కామన్. అయితే ఎటువంటి పోటీ లేకుండా సోలోగా రావడానికి కొందరు హీరోలు ప్రిఫరెన్స్ ఇస్తారు. మరికొంతమంది ఏ పోటీ ఉంటే నాకెందుకు నేరుగా బరి లోకి దిగాల్సిందే అంటారు. వాళ్ల మీద ఉన్న నమ్మకం కొద్ది.. మేకర్స్ కూడా వాళ్ల మీద ఉన్న నమ్మకంతో ఎంత పోటీ అయినా సరే ఢీ అంటే ఢీ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తారు.


సినిమాలైతే పోటాపోటీగా రంగంలోకి దిగుతాయి కానీ రిజల్ట్ ఏంటి అనేది మాత్రం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఈ దసరాకి మూడు సినిమాలు పోటాపోటీగా బరిలోకి దిగాయి. విజయ్ లియో, బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఒకదానితో ఒకటి తలపడినప్పటికీ టైగర్ కాస్త వెనకబడింది. ఇక సంక్రాంతికి వరుస పెట్టి అరడజను సినిమాలపైనే పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈమధ్యలో మిగిలిన డిసెంబర్ నైనా ఖాళీగా వదులుతారా అంటే రెండు పెద్ద సినిమాలు.. ఇద్దరు పెద్ద హీరోలు.. రెండు భారీ ఇండస్ట్రీలు.. యుద్ధానికి సై అంటున్నాయి.

ఈ రెండు సినిమాల కోసం సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలు మరేవో కాదండి బాలీవుడ్ బాద్షా డుంకీ, టాలీవుడ్ డార్లింగ్ సలార్. మొత్తం చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ఈ రెండు సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డుంకీ.. డిసెంబర్ 22న విడుదలవుతుంది అనగానే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా దీనిపై బజ్ బాగా క్రియేట్ అయింది. అయితే అది కేవలం సలార్ మూవీ విడుదల డేట్ రివిల్ కానంతవరక మాత్రమే.


ఎప్పుడైతే సలార్ కూడా డిసెంబర్ 22న వస్తుంది అని తెలిసిందో.. ఇక టాలీవుడ్ లో డుంకీ ప్రభావం కాస్త తగ్గింది. కెజిఎఫ్ లాంటి క్రేజీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ చిత్రం పై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉన్నాయి. ఎప్పటినుంచో విడుదల అవుతుంది అని ఆశిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 22న వస్తుంది అని తెలియడంతో టాలీవుడ్లో కాస్త హల్చల్ మొదలైంది. ఈ మూవీ ఇంపాక్ట్ టాలీవుడ్ పై ఏ రేంజ్ లో ఉంది అంటే సినిమా వస్తుంది అని తెలియగానే చాలా సినిమాలు తమ డేట్ లను ముందుకి..వెనక్కి మార్చుకున్నాయి.

ఇక షారుక్ సినిమా కూడా ప్రభాస్ మూవీ తో పోటీ పడలేక వెనక్కి తగ్గుతుంది అని అందరూ ఆశించారు. కానీ ఎవరు పోటీ ఉన్నా మాకు ఒరిగేది ఏమీ లేదు అన్నట్టు చెప్పిన డేట్ కే రావడానికి మంకు పట్టు పట్టుకొని కూర్చున్నారు ఈ మూవీ టీం. ఈ నేపథ్యంలో సలార్ ను దెబ్బతీయడానికి తమ వంతు స్కెచ్ కూడా సిద్ధం చేసుకున్నారు. సలార్ విడుదల కంటే ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 21న డుంకి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.. ఈ లెక్క ప్రకారం ఓవర్సీస్ లో ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుందా ఇక బాలీవుడ్ లో డుంకీ కి ఎదురు లేదు. ఇక ఉన్న స్క్రీన్ ను మొత్తం లాగేస్తారు. అలా ఒకరోజు వెనక రిలీజ్ కావడంతో సలార్ హిట్ టాక్ తెచ్చుకున్న థియేటర్ల విషయంలో ఇబ్బంది పడుతుంది.

ప్రస్తుతం ఇండియా మొత్తం మీద సుమారు 8500 స్క్రీన్స్ సిద్ధంగా ఉన్నాయి. మొదటిరోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సుమారు 5000 స్క్రీన్స్ వరకు డుంకీ లాగేస్తుంది. ఇక ముందు ముందు ఈ లెక్క పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే సలార్ కి వచ్చే స్క్రీన్స్ కౌంట్ చాలా తగ్గిపోతుంది. ఇదే గనుక జరిగితే స్క్రీన్స్ కౌంట్ తగ్గిన ప్రభావం నేరుగా సలార్ మూవీ పై బాగానే పడుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్ లో కూడా పెద్ద హాట్ డిస్కషన్ టాపిక్ గా మారింది. సలార్ ను తొక్కడానికి షారుఖ్ ఖాన్ టీం భలే స్కెచ్ వేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరుగుతాయా లేక లెక్కలు తారుమారవుతాయా అన్నది మాత్రం సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×