EPAPER

Salaar : సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ దెబ్బ .. బుక్ మై షో అబ్బా..

Salaar : సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ దెబ్బ .. బుక్ మై షో అబ్బా..

Salaar : ఇక రెండు రోజుల్లో సినీ లవర్స్ కు పండుగే ఎందుకంటే థియేటర్లలో డిసెంబర్ 22న సలార్ మూవీ విడుదల కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం కోసం డార్లింగ్ అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు,సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ గురించి అన్ని చోట్ల భారీ క్రేజ్ రావడంతో కలెక్షన్స్ అదురుతాయి అని ముందు నుంచే అనుకున్నారు కానీ.. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఇలా జరుగుతుంది అని ఎవరు అనుకోలేదు.


సలార్ చిత్రానికి మొదటి నుంచి ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మూవీకి ఉన్న క్రేజ్ కారణంగా పెద్దగా పబ్లిసిటీ అవసరం లేదు అని భావించిన మూవీ మేకర్స్.. ప్రమోషన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. వారి అంచనా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ కి వస్తున్న స్పందన చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షో యాప్ లో ఇప్పటికే హిందీ ,కన్నడ, తమిళ్ భాషల్లో రిలీజ్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం టికెట్ల రేట్లు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు వేసిన కారణంతో పర్మిషన్ వచ్చాక ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఇక ఆన్లైన్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్న డార్లింగ్ అభిమానులు.. ఒక్కసారిగా బుక్ మై షో యాప్ పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ల దాడి తట్టుకోలేక గజగజ వణికిన బుక్ మై షో యాప్ ..క్రాష్ అయిపోయింది.


దీన్ని బట్టి సలార్ కోసం ఆన్లైన్లో బుకింగ్ యుద్ధం ఏ రేంజ్ లో జరుగుతుందో టికెట్లు బుకింగ్ సమయంలో తమకు కలుగుతున్న అంతరాయాం పై ఒక అభిమాని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. దీనికి స్పందించిన బుక్ మై షో యాప్ యాజమాన్యం.. కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ఇష్యూ ఫిక్స్ చేస్తున్నట్లుగా పేర్కొంది.

ఇక టికెట్ల విషయానికి వస్తే మూవీ పై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో టికెట్ల ధరలు కూడా అంతే భారీగా ఉన్నాయి. సింగిల్ థియేటర్ల విషయానికి వస్తే టికెట్ ధర 175 నుంచి 250 రూపాయల వరకు ఉంటే మరో పక్క మల్టీప్లెక్స్ లు 400 నుంచి 470 వరకు టికెట్ల ధరలు పెంచేశాయి.

ఇప్పటికే బుక్ మై షో లో దాదాపు మొదటి రోజుకు సంబంధించి టికెట్లు సాలిడ్ గా అమ్ముడుపోయాయి. హైదరాబాదులో అయితే ఒక్కటంటే ఒక్క థియేటర్లో కూడా టికెట్ ఖాళీగా కనిపించే ఛాన్స్ లేదు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో మాక్సిమం సలార్ ఆడుతున్న అన్ని థియేటర్ల పరిస్థితి ఇదే.ఈ నేపథ్యంలో కన్ఫామ్ గా సలార్ కు మొదటి రోజే హౌస్ ఫుల్ బోర్డు పడిపోతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×