EPAPER

Salaar Second Song Release : యుద్ధమైన చిరునవ్వుతో ఆపాలి.. అదరగొడుతున్న సలార్ సెకండ్ సాంగ్..

Salaar Second Song Release : యుద్ధమైన చిరునవ్వుతో ఆపాలి.. అదరగొడుతున్న సలార్ సెకండ్ సాంగ్..
Salaar Second Song Release

Salaar Second Song Release : డిసెంబర్ 22 న సలార్ విడుదల కాబోతోంది. ఆ చిత్రం నుంచి రెండవ పాటని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ పాట కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు విడుదలైన ఈ పాట ఎలా ఉందో చూద్దాం పదండి ..కేజిఎఫ్ లో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఈశ్వరి రావ్ ఒక క్లాసులో టీచర్ గా కనిపిస్తుంది. ఒక అబ్బాయిని లేపి నేను నేర్పిన పాట గుర్తు ఉందా అని అడుగుతుంది దానికి అబ్బాయి గుర్తుంది టీచర్ అని చెప్పగానే పాడమంటుంది.ప్రతి గాధలో రాక్షసుడే హింసలు పెడతాడు అంటూ స్టార్ట్ అయ్యే పాట..వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పాట పాడే సమయంలో అదే క్లాస్ రూమ్ లో శృతిహాసన్ కూడా ఉంటుంది.


అనచగనే పుడతాడు రాజే ఒకడు.. అంటూ ప్రభాస్ ని చూపిస్తారు. శత్రువుని కడతేర్చే పనిలో మన రాజు.. హింసలనే మరిగాడు.. మంచిని మరిచే.. అంటూ ప్రభాస్ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ సాంగ్ లో వివరించారు. ఇక ఈ సాంగ్ లో గెలవాలి అంటే మన్నించాలి.. కోపం మరి లోపం అవ్వదా.. అని చిన్నారులు పాడే విధానం చాలా అద్భుతంగా ఉంది.

యుద్ధమైన చిరునవ్వుతోటి నువ్వు ఆపేసి చూపాలి రా.. అంటూ సాగే పాట ఈ చిత్రంలో హింసను హీరో అడాప్ట్ చేసుకోవడం అతని తల్లికి నచ్చలేదు అన్న విషయాన్ని కన్వే చేస్తుంది. అలాగే మనిషికి మాటే ముఖ్యం.. ఇచ్చిన మాట తప్పితే గెలవవు.. అనే ఒక లిరిక్ ఈ పాటలో మూవీ పై ఆసక్తి రేపుతోంది. ఎవరు ఏ మాట ఇచ్చారు? ఇచ్చిన మాటను ఎవరు తప్పారు? అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది. ఈ పాట మొత్తం ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ కోసమే అని అనిపిస్తుంది.


లిరిక్స్ ఎంతో అర్థవంతంగా ఉండటమే కాకుండా.. మనసును కదిలించే విధంగా ఉన్నాయి. ఈ పాటకు పదాలను కృష్ణ కాంత్ అందించగా.. రవి బాసూరి మ్యూజిక్ కు ముచ్చటైన చిట్టి చైల్డ్ సింగర్స్ ఈ పాటకు ప్రాణం పోశారు. చిట్టి పొట్టి మాటలతో ఈ చిన్నారులు ఈ పాటతో గట్టి గా మంచి సందేశాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో ఈశ్వరి రావు పాత్ర చాలా స్ట్రాంగ్ అన్న విషయం ఈ పాటలో అర్థం అవుతుంది. ఫైనల్ గా సాంగ్ క్లోజింగ్ లో బ్లాక్ బోర్డ్ పై విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్.. దే కమ్ ఫ్రమ్ ఫర్ గివ్ నెస్.. అనే మంచి క్యాచీ స్టేట్మెంట్ తో ముగించారు. మొత్తానికి ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Related News

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Big Stories

×