EPAPER

Salaar : ప్రభాస్ ఖాతాలో ఖాన్లకు చెమటలు పట్టించే అరుదైన రికార్డు… ఆ లిస్ట్ లో టాప్ 3లో “సలార్”

Salaar : ప్రభాస్ ఖాతాలో ఖాన్లకు చెమటలు పట్టించే అరుదైన రికార్డు… ఆ లిస్ట్ లో టాప్ 3లో “సలార్”

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఏ ముహూర్తాన పాన్ ఇండియా హీరోగా అడుగు పెట్టాడో తెలీదు గానీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ గల్లంతయ్యేలా చేశాడు. తాజాగా మరోసారి బాలీవుడ్ కు సంబంధించిన ఓ లిస్టులో ఏకంగా మూడో స్థానాన్ని దక్కించుకొని అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


“సలార్”తో సరికొత్త రికార్డు

ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” (Salaar) బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఖాతాలో పలు రికార్డులు పడగా, థియేటర్లలో, ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఇప్పుడు టీవీ వంతు వచ్చింది. తాజాగా “సలార్” మూవీ టీవీ ప్రీమియర్స్ లోను సత్తా చాటి ప్రభాస్ ఖాతాలో అరుదైన ఘనత పడేలా చేసింది. గత ఏడాది రిలీజ్ అయిన ‘సలార్’ మూవీ ప్రభాస్ (Prabhas)కు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత నెట్ ఫిక్స్ లో రిలీజయ్యి, ఓటిటిలో కూడా వ్యూస్ పరంగా దుమ్మురేపింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ వర్షన్ ఉత్తరాదిన టీవీలో ప్రీమియర్ కాగా, అక్కడ మిలియన్ల కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకుని ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ మూవీ టీవీలలో ఏకంగా 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి 2024 లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 3 సినిమాల జాబితాలో నిలవడం విశేషం. ఇదే విషయం తెలుపుతూ సదరు టీవీ సంస్థ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ‘సలార్’ పార్ట్ వన్ కు మంచి రెస్పాన్స్ రాగా, రెండో పార్ట్ ‘శౌర్యంగ పర్వం’ (Shouryanga Parvam) గురించి ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘సలార్ 2’ (Salaar 2) మూవీ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) సినిమాతో బిజీగా ఉండగా, ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.


ఖాన్లకు చెమటలు పట్టించే రికార్డులు 

ప్రస్తుతం ప్రభాస్ పేరు చెప్తే బాలీవుడ్ బడా స్టార్స్ నిద్రలో కూడా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. సొంత గడ్డపై షారుఖ్, సల్మాన్ వంటి స్టార్స్ క్రియేట్ చేయలేకపోయినా రికార్డును తాజాగా ప్రభాస్ క్రియేట్ చేసి చూపించారు.  ‘సలార్’ సినిమా రిలీజ్ టైమ్ లో ఉత్తరాదిన థియేటర్లు ఇవ్వకుండా ఎలా ఇబ్బంది పెట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నీ అడ్డంకులను దాటుకుని ప్రభాస్ అదే సినిమాతో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడేమో టెలివిజన్ లో కూడా ప్రభాస్ (Prabhas) పై ఉత్తరాది ప్రజలకు ఉన్న అభిమానం ఏంటో ప్రూవ్ అయ్యింది. 2024 లోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాల లిస్ట్ లో ఫైటర్ (Fighter), పంచాయత్ 3 (Panchayat 3) ఉండడం విశేషం.

Related News

Anee Master: జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Veekshanam Movie Review : వీక్షణం మూవీ రివ్యూ…

Most Handsome Hero: వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఇతడే.. షారుఖ్ స్థానం ఎంతంటే..?

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెట్ లో ఫోటోలు వైరల్

Kiran Abbavaram: సినిమాని తలపిస్తున్న హీరోగారి లవ్ స్టోరీ.. వింటే షాక్..!

Big Stories

×