EPAPER

Salaar Review: వరుస ఫ్లాప్ లతో ఉన్న ప్రభాస్.. సలార్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడా ?

Salaar Review: వరుస ఫ్లాప్ లతో ఉన్న ప్రభాస్.. సలార్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడా ?

Salaar Review: టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సలార్ చిత్రం ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ విడుదలైంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డార్లింగ్ ప్రభాస్ డైనమిక్ యాక్షన్ లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.


సినిమా: సలార్- పార్ట్ 1 సీజ్ ఫైర్

నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, సప్తగిరి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయారెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్


రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్

నిర్మాత: విజయ్ కిరంగదూర్

సినిమాటోగ్రఫి: భువన్ గౌడ

మ్యూజిక్: రవి బస్రూర్

నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్

రిలీజ్ డేట్: 2023-12-22

కథ:

దేవా అలియాస్ సలార్ (ప్రభాస్) తన తల్లితో అస్సాంలో నివసిస్తుంటాడు. అక్కడ అతను ఓ బొగ్గు గనిలో పని చేస్తూ ఉంటాడు. ఆ ప్రాంతానికి ఆద్య (శృతిహాసన్) రావడం.. అక్కడ టీచరుగా ఉన్న ఆమెను ఎవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమెను దేవా కాపాడుతాడు. సడెన్ గా ఒక రోజు దేవా ను వెతుక్కుంటూ 25 సంవత్సరాల తర్వాత అతని ఫ్రెండ్ వరదరాజు మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఆ ప్రాంతానికి వస్తాడు. అసలు దేవా అస్సాంలో తన తల్లితో ఎందుకు ఉంటున్నాడు? ఇన్ని సంవత్సరాల తరువాత వరదరాజు మన్నార్ అతని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ఆద్యకు ఈ స్టోరీ కి అసలు సంబంధం ఏమిటి?

విశ్లేషణ:

భారతదేశం సరిహద్దుల్లో ఖాన్సార్ అని అటవీ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ దేవా ,వరదరాజు మన్నార్ మధ్య బాల్యంలో ఒక మంచి పవర్ఫుల్ సన్నివేశాలతో సలార్ చిత్రం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అస్సాంలో బొగ్గు గనుల్లో పని చేస్తూ దేవా ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు. అక్కడ నుంచి అతను ఒక పవర్ఫుల్ నాయకుడిగా ఎలా ఎస్టాబ్లిష్ అవుతాడు అనే ప్రయాణాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఫస్ట్ ఆఫ్ చివరిలో దేవా ఎవరు అతని లైఫ్ ఏమిటి అనే దాన్ని ఎక్స్ప్లైన్ చేయడంతో అసలు కథ మొదలైంది అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ తర్వాత ఖాన్సార్ అసలు సంగతి.. రాజమన్నార్ ఆ అటవీ ప్రాంతానికి అధినేతగా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని చూపిస్తారు. అయితే అనుకోకుండా ఒక పని మీద రాజ్ మన్నార్ దేశం దాటి వెళ్లిన వెంటనే సామంతులు తమ కుట్రలు మొదలు పెడతారు. తన తండ్రి లేని సమయంలో జరుగుతున్న కుట్రలను ఆపడం కోసం వరదరాజ మన్నార్‌, దేవా సహాయం కోరుతాడు. ఇక అక్కడి నుంచి స్టోరీ పీక్స్ కి వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ పై ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరి రావు నటన కూడా ఎంతో అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా ఉంది.

నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంపై కేజిఎఫ్ ఛాయలు ఉన్నాయి అన్న వాళ్లందరూ ఔరా అని ముక్కున వేలు వేసుకొని చూసే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్.ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను ఈ చిత్రంలో మలిచిన విధానం.. స్టోరీ కే హైలెట్ గా ఉంది. ఈ మూవీ స్క్రీన్ ప్లే కే జి ఎఫ్ ను మించి అన్నట్టు కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ పాత్ర పూర్తిగా అండర్ డాగ్ క్యారెక్టర్ తో సాగుతుంది.. అదే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎవరు ఊహించనంత విధమైన భీభత్సాన్ని ఒంటిచేత్తో సృష్టిస్తాడు. కాటేరమ్మ ఎపిసోడ్ విష్ణు తండ్రితో ఉన్న రెండు ఎపిసోడ్స్ ఒకప్పటి ప్రభాస్ ను గుర్తు చేశాయి.

వరదరాజ మన్నార్‌ గా పృథ్వీరాజ్ సుకుమారన్.. అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక శృతిహాసన్ కేవలం కథను డ్రైవ్ చేసే ఒక పాత్రలో కనిపిస్తుంది. ఆమె పరిధి మీద ఆమె అద్భుతంగా నటించింది. రాజ్ మన్నార్ గా జగపతిబాబు కూడా మంచి నటన కనబరిచాడు. ఈ చిత్రానికి కథ ఎంత ఇంపార్టెంట్ బ్యాక్ గ్రౌండ్ అంతకంటే ఇంపార్టెంట్.రవి బస్రూర్ ఈ మూవీలో తన మ్యూజిక్ తో నిజంగానే మ్యాజిక్ చేశాడు. మరి ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ సన్నివేశాలలో అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి బాక్స్ బద్దలై పోవాల్సిందే. ఇందులోని యాక్షన్ సన్నీ వేషాలు చిత్రీకరించిన తీరు చాలా హైలైట్ గా ఉంది. క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే మూవీ మరింత బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా షడ్రుచుల తో వండిన బాహుబలి థాలీ. ఆ రేంజ్ లో ప్రభాస్ అభిమానులకు ఈసారి తన సినిమాతో ఫీస్ ఇచ్చాడు.

ప్రభాస్ ఎంట్రీ సీన్ ,ఇంటర్వెల్ ఫైట్ అలాగే చున్ని ఫైట్.. ఈ మూవీలో హైలెట్గా నిలుస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువే. అక్కడక్కడ ఆక్షన్ డోర్స్ చాలా ఎక్కువ అనిపించినా.. స్క్రీన్ మీద ఉన్నది ప్రభాస్ కాబట్టి ఆ కటౌట్ కి ఆ మాత్రం కావాలి అని అనిపిస్తుంది. భారీ యాక్షన్స్ అన్ని వేశాలలో ప్రభాస్ రెచ్చిపోయాడు.. ఇటు మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతారు.

చివరి మాట: సలార్ కు సాహో.. అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్.. యాక్షన్ మూవీ లవర్స్ కు బిగ్ ఫెస్టివల్.

Related News

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Actress : యాడ్ షూట్ లో డర్టీ పనులు… స్టార్ హీరో అసభ్యకరంగా తాకాడంటూ హీరోయిన్ ఆరోపణలు

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Big Stories

×