EPAPER

Rules Ranjann Movie Review: కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ఎలా ఉందో తెలుసా?

Rules Ranjann Movie Review: కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ఎలా ఉందో తెలుసా?

Rules Ranjann Movie Review: కిరణ్ అబ్బవరం ..గత కొద్ది కాలంగా వరుస సినిమాలు చేస్తూ తనదైన వినూత్నమైన శైలిలో దూసుకుపోతున్న కుర్ర హీరో. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే కిరణ్ ఈసారి కూడా రూల్స్ రంజన్ అంటూ ప్రేక్షకులను రంజింప చేయడానికి వచ్చేసాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన సమ్మోహనుడా సాంగ్ ఎందరినో సమ్మోహన పరిచి…మూవీ పై అంచనాలను పెంచేసింది.ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం పదండి….


చిత్రం : రూల్స్ రంజన్
నటీనటులు : కిరణ్ అబ్బవరం, వెన్నెల కిషోర్, నేహా శెట్టి.
నిర్మాత : దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి
దర్శకత్వం : రతినం కృష్ణ
సంగీతం : అమ్రీష్
విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

స్టోరీ : మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి.. యావరేజ్ స్టూడెంట్ దశ నుంచి ఎంతో కష్టపడి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఉద్యోగం చేయడం కోసం ముంబైకి కూడా షిఫ్ట్ అవుతాడు. కానీ అంతంత మాత్రమే చదువులు ఉండడంతో హిందీ రాదు…అయినా కష్టపడి నేర్చుకొని టీం లీడర్ గా మారుతాడు. ఒక స్టేజికి వచ్చిన తర్వాత ఇక అతను తన రూల్స్ ఆఫీస్ లో చెలాయించడం మొదలుపెడతాడు. ఇదిగో అక్కడ నుంచి మొదలవుతుంది సినిమా టైటిల్ రూల్స్ రంజన్.


ఇక ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా అతని కాలేజ్ పాత ఫ్రెండ్ సన (నేహా శెట్టి) ని కలవడం జరుగుతుంది. కాలేజ్ డేస్ నుంచి సన పై ఉన్న మూగ ప్రేమను బయట పెట్టడానికి భయపడుతూ వచ్చిన రంజన్ ఆమెను కలిసిన తర్వాత చెబుతాడు. సన కూడా రంజాన్ ను ఇష్టపడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరు విడిపోతారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? తిరిగి తన ప్రేమను పొందడానికి మనోరంజన్ ఏం చేశాడు? సన పెళ్లిని ఎలా ఆపగలిగాడు? ఈ క్రమంలో అతను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? తెలుసుకోవాలి అంటే ఆలస్యం చేయకుండా బిగ్ స్క్రీన్ పై సినిమాను చూసేయండి.

విశ్లేషణ: రాజా వారు రాణి గారు…మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కెరీర్ మొదలు పెట్టాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటివరకు వరుసగా వినూత్నమైన సినిమాలు చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. స్టార్ హీరోలు అయినా నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయడానికి కాస్త ఆలోచిస్తున్నారేమో కానీ కిరణ్ మాత్రం వరుస పెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్నాడు. ఈరోజు విడుదలైన స్కూల్స్ రంజన్ చిత్రం కూడా ఎప్పుడో విడుదల అవ్వాల్సిందే…కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

స్టోరీ కాస్త బలంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత అసలు డైరెక్టర్ ఈ మూవీ ద్వారా ఏమీ కన్వే చేయాలనుకున్నాడు అనేది ఎంత ఆలోచించినా ఒక పట్టానా అర్థం కాదు. సినిమా ముందుకు వెళుతున్న కొద్ది చూసే వాళ్ళలో కన్ఫ్యూజన్ పెరుగుతూ పోతుంది. కామెడీ యాంగిల్ అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. పర్ఫామెన్స్ పరంగా కిరణ్ అభవరం తన వంతు కృషి చేశాడు. ఇక నేహా శెట్టి గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే ఈమెది యాక్షన్ కి స్కోప్ ఉన్న పాత్ర అయితే కాదు…కేవలం అందాల అరబోయడమే సరిపోయింది.

ఇక పాటల విషయానికి వస్తే శ్రేయ ఘోషల్ పాడిన సమ్మోహనుడా పాట పక్కన పెడితే ఇంకా ఏ పాటలు అంతగా గుర్తింపు తెచ్చుకునే విధంగా లేవు. ఇందులో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కొంచెం సాగదీతక ఉంది. ఏదో కొత్తగా చెప్పాలి అని మూవీ ద్వారా డైరెక్టర్ ట్రై చేశాడు ఆ తపన కనిపిస్తోంది కానీ ఏం చెప్పాలి అనుకున్నాడు అనేది మాత్రం అర్థం చేసుకోవడం కాస్త కష్టం.

ప్లస్ పాయింట్స్ :

నేహా శెట్టి గ్లామర్ రోల్ మూవీ కి మాంచి ప్లస్ పాయింట్.

అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి.

థియేటర్లో సమ్మోహనుడా సాంగ్ కి సెగలు రెగుతాయి.

మైనస్ పాయింట్స్:

స్టోరీ అంత కంటెంట్ ఉన్నదైతే కాదు.

ఇక స్క్రీన్ ప్లే అంతంత మాత్రంగానే ఉంది.

కొన్ని సీన్స్ అయితే సహనాన్ని పరీక్షిస్తాయి.

ఎండింగ్ లో ఎటువంటి కొత్తదనం లేదు.

రేటింగ్ : 2/5

ట్యాగ్ లైన్ : మీరు కిరణ్ అబ్బవరం ఫాన్స్ అయితే ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. లాజిక్ లేని మ్యాజిక్ మూవీస్ నచ్చే వాళ్లకి కూడా ఈ చిత్రం పర్వాలేదు. అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం పెద్దగా ఈ మూవీ అలరించదు.

Related News

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Big Stories

×