EPAPER

Rukmini Vasanth: ఎన్టీఆర్ తో రొమాన్స్.. అంత మాట అనేసిందేంటీ..?

Rukmini Vasanth: ఎన్టీఆర్ తో రొమాన్స్.. అంత మాట అనేసిందేంటీ..?

Rukmini Vasanth: దాదాపు ఆరేళ్ళ తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ .. దేవర సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలు.. మరెన్నో అనుమానాల  మధ్య దేవర సెప్టెంబర్  27 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు నెరవేరలేదు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఎన్టీఆర్ నీల్ మీదనే పెట్టుకున్నారు. కెజిఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్31.


మైత్రీ మూవీ మేకర్స్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న విషయం తెల్సిందే. దేవర తరువాత బాలీవుడ్ సినిమా వార్ 2 తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. త్వరగా ఆ సినిమాను కూడా ఫినిష్ చేసి.. ఎన్టీఆర్31 సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే ముద్దుగుమ్మ ఎవరు.. ? అనేది ఎప్పటి నుంచో చర్చ నడుస్తున్న విషయం విదితమే.  ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీస్ చాలామంది పేర్లు వినిపించాయి. ఇక గత కొన్ని రోజుల నుంచి నీల్.. బాలీవుడ్ బ్యూటీని కాదు.. కన్నడ బ్యూటీని దింపుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Jani Master: కన్నబిడ్డలను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన జానీ మాస్టర్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో


సప్తసాగరాలు దాటి  సినిమాతో తెలుగు కుర్రకారుకు పరిచయమైన అందం రుక్మిణీ వసంత్. అందం, అభినయం  కలగలిపిన ఈ బ్యూటీని  చూసి టాలీవుడ్ కుర్రోళ్లు క్రష్ లిస్ట్ లో యాడ్ చేశారు.  ఇక ఈ సినిమా తరువాత అమ్మడు తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాలో నటిస్తుంది. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యింది అని అడిగితే.. అది ఎవరికి తెలియదు. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో రుక్మిణీ హీరోయిన్ గా కనిపించి షాక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత రుక్మిణీ.. ఎన్టీఆర్ నీల్ సినిమాలో నటించే  లక్కీ ఛాన్స్ పట్టేసిందని చెప్పుకొచ్చారు.

తాజాగా ఆ పుకార్లపై రుక్మిణీ స్పందించింది. ఆమె నటించిన బఘీర సినిమా అక్టోబర్ 31 న రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. కన్నడ నటుడు శ్రీమురళి హీరోగా నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రబృందం.. తెలుగులో కూడా ప్రమోషన్స్  వేగవంతం చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేశారటగా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ” నిజమా.. నేను ఇప్పుడే వింటున్నాను. ఇది చాలా మంచి రూమర్. ఇది నిజమయ్యేలా చూడండి” అని చెప్పుకొచ్చింది. ఇక అది నిజమైతే మాకేం ఇస్తారు అని యాంకర్ అడగ్గా.. పార్టీతో పాటు ఫేమస్ స్వీట్  దూద్ పెడా బాక్స్  ఇస్తానని చెప్పుకొచ్చింది.

Devara: సోషల్ మీడియాను షేక్ చేసిన చుట్టమల్లే వీడియో సాంగ్.. వచ్చేసింది

ఇక రుక్మిణీ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అదేంటి.. అంత మాట అనేసింది.. ఇంకా ఆమెను ఎవరు సంప్రదించలేదా.. ? ఈపాటికి సైన్ చేసేసి.. సెట్స్ కు కూడా వెళ్లి ఉంటుందేమో అనుకున్నామే.. సరే ఇప్పటికీ మించిపోయింది లేదు. నీల్ మావా.. రుక్మిణీని కన్సిడర్ చేసి ఆ రూమర్స్ ను నిజం చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి చివరాఖరికి ఎన్టీఆర్ పక్కన రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరో  తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

×