EPAPER
Kirrak Couples Episode 1

RRR : అమెరికాలో RRR టీమ్ సందడి.. నాటు నాటు సాంగ్ గురించి జక్కన్న చెప్పిన సంగతులు..!

RRR : అమెరికాలో RRR టీమ్ సందడి.. నాటు నాటు సాంగ్ గురించి జక్కన్న చెప్పిన సంగతులు..!

RRR : ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి పేరు అంతర్జాతీయస్థాయిలో వినిపిస్తోంది. ‘నాటు నాటు’ పాట ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకోవడంతో సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే RRR టీమ్ అమెరికాలో సందడి చేస్తోంది. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, రాజమౌళి కొడుకు కార్తికేయ అమెరికాలోనే ఉన్నారు. అయితే తారకరత్న మరణం, పెద్ద కర్మ కారణంగా వాళ్లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ అమెరికా వెళ్లలేకపోయాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లాడు. యూఎస్ లో దిగిన తర్వాత తారక్ కాలిఫోర్మియా నుంచి ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వెనుక పులి బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకున్న ఎన్టీఆర్ బాల్కనీలో నిల్చొని వెనుక నుంచి తీసిన పిక్ ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు. బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియాలో ఉన్నట్లు అందులో తెలిపాడు. మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకల్లో RRR టీమ్ సందడి చేయనుంది. స్టేజ్ పై ఈ పాటను గాయకులు కాలభైరవ ,రాహుల్ సిప్లిగంజ్ పాడనున్నారు.


ఎక్కడ షూట్ చేశారంటే..?
నాటునాటు పాటను ఉక్రెయిన్‌లోని కీవ్‌లోని అధ్యక్ష రాజభవన ప్రాంగణంలో షూట్ చేశారు. ముందుగా ఈ పాటను భారత్ లోనే చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయం వర్షాకాలం కావడంతో సాధ్యం కాలేదు. చాలాచోట్ల వెతికి చివరికి ఉక్రెయిన్ వెళ్లారు. విశాలమైన రాజభవనం, డ్యాన్సర్లకు సరిపోయేలా ప్రాంగణం ఇలా తను ఊహలకు అనుగుణంగా ఆ ప్రదేశం ఉందని అందుకే అక్కడే షూటింగ్ చేశామని ఆ విషయాలను రాజమౌళి తాజాగా గుర్తు చేసుకున్నారు.

స్పెషల్ ఏంటంటే..?
నాటు నాటు పాటలో ఎంతో మంది డ్యాన్సర్లు ఉన్నా రామ్‌చరణ్‌, తారక్‌ మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే ఆ పాటలో వాళ్లు వేసే స్టెప్పులు అలా ఉన్నాయని మరి. అయితే ఇంకా కొన్ని ఆసక్తికర అంశాలున్నాయి. పాటలో ఉక్రెయిన్‌ పార్లమెంట్ భవనం డోమ్‌ కూడా ఓ షాట్‌లో కనిపించింది. పాటలో బ్యాగ్రౌండ్‌లో కనిపించే యువతులు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు కారు. నిజమైన డ్యాన్సర్లనే తీసుకొచ్చారు. అలాగే అసలైన మ్యూజీషియన్స్‌నే పాటలో సంగీత కళాకారులుగా చూపించారు. పాటలో వాళ్లను గమనిస్తే బ్యాగ్రౌండ్‌లో వాళ్ల లైట్‌ మూమెంట్స్‌ కనిపిస్తాయి. పాటలోని ఐకానిక్‌ స్టెప్‌ కోసం కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ సుమారు 100కుపైగా స్టెప్స్‌ కంపోజ్‌ చేసి ఇచ్చాడని రాజమౌళి తెలిపాడు.


నాటు నాటు స్టెప్‌ మొదలయ్యే ముందు రామ్‌, భీమ్‌ వేసుకున్న సస్పెండర్స్‌ను జెన్నీ లాగి వదులుతుంది. వెంటనే వాళ్లు స్టెప్స్‌ మొదలుపెడతారు. అయితే నిజానికి ఆ సస్పెండర్స్‌ లాగి వదిలినప్పుడు ఇద్దరికీ బలంగా తాకిందట. అక్కడ నవ్వేసినా.. కట్‌ చెప్పగానే నొప్పితో ఇబ్బందిపడ్డారట. పాట మొత్తం తారక్‌, చరణ్‌ వేసుకున్న సస్పెండర్స్‌.. వాటితో ఆడుతూ వేసే మూమెంట్స్‌ చేసేటప్పుడు వేసుకున్న సస్పెండర్స్‌ ఒకటి కావట. ఆ స్టెప్పుల కోసం కాస్త వదులుగా ఉన్నవి డిజైన్‌ చేయించారట. అలాగే ఆ స్టెప్‌.. రాజమౌళికి పాటలో నచ్చిన మూమెంట్‌ అట.

పాటలో రామ్‌చరణ్‌, తారక్‌ల బ్రొమాన్స్‌ కనిపిస్తుంది. అయితే ఈ పాటలో ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లో ఫైట్‌ చేసేలా ఉంటుంది. కొన్ని పోస్చర్స్‌లో ఆ ఫైటింగ్‌ బాడీ లాంగ్వేజ్‌ గమనించొచ్చు అని రాజమౌళి చెప్పారు. పాట ఆఖరున మట్టిలో డ్యాన్స్‌ చేయించేటప్పుడు కాస్ట్యూమ్స్‌తో చాలా ఇబ్బంది పడ్డారట. కట్‌ చెప్పడం ఆలస్యం.. మొత్తం కాస్ట్యూమ్స్‌ టీమ్‌ దుస్తుల్ని శుభ్రం చేయడానికి సిద్ధమయ్యేవారట. దీని కోసం ఒకే తరహా డ్రెస్సులు 3 సిద్ధం చేయించారట. ఈ విషయాలను తాజాగా రాజమౌళి పంచుకున్నారు. మరోవైపు మార్చి 10న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు.

Related News

IIFA 2024 : అవార్డు ఇస్తామని పిలిచి అవమానించారు… ఐఫా నిర్వాహకులపై కన్నడ డైరెక్టర్ ఫైర్

Ashwini Dutt: ఇప్పటికీ ఆ కోరిక అలానే ఉండిపోయింది.. కల్కి నిర్మాత కామెంట్స్..!

Allu Arjun : పవన్‌కు ఫుల్ స్టాప్ పెట్టడమే టార్గెట్… వైసీపీ లీడర్‌తో బన్నీ వ్యూహం?

Mechanic Rocky : విశ్వక్ ను వీడని పోస్ట్ పోన్ గండం… ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ వాయిదా ?

Trivikram – Allu Arjun : ‘త్రివిక్రమ్‌తో తియ్యొద్దు’… కానీ, బన్నీ వినేలా లేడే..

Minu Muneer : ఆ సినిమాలు చూడమన్నాడు… లైంగిక ఆరోపణలతో మరో డైరెక్టర్ పై బాంబ్ వేసిన మలయాళ నటి

October Release Movies: అక్టోబర్లో విడుదలయ్యే చిత్రాలు.. ఇది కదా ఫ్యాన్స్ కి అసలైన దసరా..!

Big Stories

×