EPAPER

RRR Movie: జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం.. 71 ఏళ్ల తర్వాత ఈ మూవీనే..

RRR Movie: జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం.. 71 ఏళ్ల తర్వాత ఈ మూవీనే..

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యా్ప్తంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లను గ్లోబల్ స్టార్లను చేసింది. జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ పేరుపై రికార్డులు ఉన్నాయి. తాజాగా జపాన్‌లో ఈ మూవీపై మరో రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యి రెండేళ్లపైనే అయ్యింది. ఓటీటీలోకి రావడం, ఎన్నో భాషల్లో ఈ మూవీని బుల్లితెరపై చూడడం కూడా అయిపోయింది. కానీ జపాన్‌లోని థియేటర్లలో మాత్రం ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) రన్ అవ్వడం సంచలనమే.


పెద్ద విషయమే

ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో 100 రోజులు ఆడడమే పెద్ద విషయం. అలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయినా కూడా వెంటనే ఓటీటీలోకి వచ్చేయడంతో సినిమాల థియేట్రికల్ రన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. 100 రోజులకు మించి ఒక మూవీ థియేటర్లలో ఉందంటే అది మామూలు విషయం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయిన కొత్తలో కొన్ని థియేటర్లలో 50 రోజులు, 7 రోజులు రన్ అయ్యింది. కానీ జపాన్‌లో మాత్రం దాదాపు రెండు సంవత్సరాల నుండి రన్ అవుతూనే ఉంది. తెలుగు సినిమా కాబట్టి ఇండియాలో ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసినా ప్రేక్షకులు అంతగా ఆశ్చర్యపోయేవారు కాదేమో. కానీ ఇది జపాన్‌లో జరగడం విశేషం.


Also Read: గూగుల్ సెర్చ్ లో OG కాస్ట్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ?

జపాన్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్

ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ పేరు చెప్తే గుర్తుపట్టనివారు ఉండరు. జపాన్‌ (Japan)లో అయితే ఈ సినిమాకు భారీ ఫ్యా్న్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాపై చూపిస్తున్న అభిమానం వల్లే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అక్కడికి వెళ్లి మరీ ప్రమోషన్స్ చేసింది. అక్కడ 71 ఏళ్ల పాత థియేటర్లో 21 నెలల నుండి అంటే 1 సంవత్సరం 9 నెలల నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రన్ అవుతూనే ఉంది. 2022 మార్చిలో ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా విడుదలయ్యింది. కానీ జపాన్‌లో విడుదలవ్వడానికి కాస్త సమయం పట్టింది. 2022 అక్టోబర్ 22న విడుదలయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు ఒక థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రన్ అవ్వడం సంచలనం.

చివరిసారిగా థియేటర్‌లో

జపాన్‌లో దాదాపు 21 నెలల నుండి ‘ఆర్ఆర్ఆర్’ రన్ అవుతుంది అనే విషయాన్ని ఆ థియేటర్ యాజమాన్యమే బయటపెట్టింది. దీని గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. పైగా వచ్చేవారమే ‘ఆర్ఆర్ఆర్’కు ఆ థియేటర్‌లో చివరి వారమని కూడా ప్రకటించింది. దీంతో ఈ సినిమాను ఒకసారి థియేటర్లో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునేవారు మరోసారి ఈ థియేటర్ ముందు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. ఈ ఒక్క సినిమా జపాన్‌లో ఎన్‌టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) రాతే మార్చేసింది. ఈ తెలుగు హీరోలను తమ సొంత హీరోలుగా ఆదరించడం మొదలుపెట్టారు అక్కడి అభిమానులు. జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ను ఒక నాటకంగా కూడా మార్చగా దానికి రాజమౌళి చీఫ్ గెస్టుగా కూడా హాజరయ్యారు.

Related News

Pawan Kalyan: డిప్యూటీ సీఎం కి ఇంకో రెండు సినిమాలు సెట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Abhishek Bachchan: ఆ హీరోయిన్ తో అభిషేక్ ఎఫైర్.. అందుకే ఐశ్వర్యకు విడాకులు.. ?

Akhanda 2 : అఖండ 2 ఫుల్ స్టోరీ లీక్..బోయపాటి దెబ్బకు ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

Anasuaya: వీడు అనసూయ మొగుడా.. అలా ఉన్నాడేంటి అని బండబూతులు తిట్టారు

Rana : ఇప్పటికీ రానా అందులో వీక్.. ఇలా షాక్ ఇచ్చాడేంటి భయ్యా..?

Rahul sipligunj: నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే.. జీవితాంతం..!

Big Stories

×